Movie Review – Peddanna

Thursday,November 04,2021 - 04:51 by Z_CLU

నటీనటులు: రజినీ కాంత్ , కీర్తి సురేష్ , మీనా , ఖుష్బు , ప్రకాష్ రాజ్, జగపతి బాబు , సూరి, అభిమన్యు సింగ్ తదితరులు

మ్యూజిక్ : D ఇమాన్

సినిమాటోగ్రఫీ : వెట్రి

ఎడిటింగ్ : రూబెన్

నిర్మాణం : SUN పిక్చర్స్

కథ -దర్శకత్వం : శివ

విడుదల తేది : 4 నవంబర్ 2021

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా రిలీజైన రోజు అభిమానులకు పండగే. ఈసారి పండగ రోజే వచ్చి ఫ్యాన్స్ కి డబుల్ జోష్ తీసుకొచ్చాడు రజినీ. ఎలాంటి బజ్ లేకుండా సైలెంట్ 'పెద్దన్న' తో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి సూపర్ స్టార్ తో దర్శకుడు శివ తీసిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? శివ మార్క్ మాస్ సినిమాతో రజినీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

rajinikanth Nayanthara peddanna movie

కథ :

రాజోలు గ్రామంలో ఊరి పెద్దగా ఉండే వీరన్న(రజినీ కాంత్) కి తన చెల్లెలు కనకమహాలక్ష్మి(కీర్తి సురేష్) అంటే ప్రాణం. తన చెల్లెలి పెళ్లి కోసం చాలా సంబంధాలు చూస్తుంటాడు వీరన్న. కానీ ఏది సెట్ అవ్వదు. ఫైనల్ గా తన శత్రువు దేవరాజు(ప్రకాష్ రాజ్) మనసు మార్చుకొని మారడంతో వీరన్న చెల్లెలిని దేవరాజు తనయుడికి చ్చిపెళ్లి చేసేందుకు నిరయిన్చుకుంటాడు.

ఆ పెళ్లి ఇష్టం లేకపోవడంతో అన్నయ్యకి చెప్పకుండా తను ప్రేమించిన అరవింద్(అరవింద్ కృష్ణ) తో కలిసి కలకత్తా పారిపోతుంది కనకం. అలా వీరన్నకి దూరంగా వెళ్లి అరవింద్ ని పెళ్ళిచేసుకున్న కనకం అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ భర్తని జైలు నుండి బయటికి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటుంది. చెల్లెలి జీవితంలోకి వచ్చి తనని ఇబ్బంది పెట్టి భర్తను జైలుకి పంపిన మనోజ్ పారేకర్ (అభిమన్యు సింగ్) ని అలాగే అతని అన్నయ్య ఉద్ధవ్ పారేకర్ ని వీరన్న పెద్దన్న గా మారి వారిద్దరినీ ఎలా భయపెట్టాడు ? చివరికి వారిని ఎలా అంతం చేసి తన చెల్లెలి జీవితాన్ని నిలబెట్టాడనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

రాజీని కాంత్ నటన గురించి కొత్తగా చెప్పేదేముంది. వీరన్న అంటూ మెప్పించి పెద్దన్నగా విజిల్స్ వేయించాడు. రెండు పేర్లతో పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసి సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచి వన్ మెన్ షో అనిపించుకున్నాడు. రజినీ తర్వాత కీర్తి నటన గురించి చెప్పుకోవాలి. కనకం పాత్రలో ఒదిగిపోయి నటించింది. నయనతార తన పాత్ర మేరకు బాగానే చేసింది. మీనా, ఖుష్బు కేవలం రెండు మూడు సీన్లకే పరిమితమయ్యారు. రజినీ వెంటే ఉండే పాత్రలో సూరి అలరించాడు. విలన్స్ గా అభిమన్యు సింగ్ , జగపతి బాబు ఆకట్టుకున్నారు. ముఖ్యంగా జగపతి బాబు గెటప్ బాగుంది. కాకపోతే ఇంతకు ముందు అరవింద సమేతలో కనిపించినట్టే అనిపిస్తుంది. మిగతా నటీ నటులంతా వారి వారి పాత్రలకు ఉన్నంతలో న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు మ్యూజిక్ మెయిన్ ఎట్రాక్షన్ అనిపించుకుంది. పాటలు జస్ట్ పరవాలేదనిపించినా బ్యాక్ గ్రౌండ్ సినిమాకు ప్లస్ అయింది. సన్నివేశాల్లో బలం లేకపోయినా తన మ్యూజిక్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు డి.ఇమాన్. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ కి తన స్కోర్ తో అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చాడు. వెట్రి సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్లస్ పాయింట్. తన కెమరా వర్క్ తో సినిమాకు మంచి విజువల్స్ అందించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేసి విజిల్స్ వేయించేలా ఉన్నాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ఫైట్స్ బాగున్నాయి.

శివ రాసుకున్న కథ -కథనం రెండూ రొటీన్ గానే అనిపించాయి. కొన్ని సన్నివేశాలు కూడా పేలవంగా ఉన్నాయి. డైరెక్టర్ గా కొన్ని మాస్ యాక్షన్ సీన్స్ మాత్రం బాగానే హ్యాండిల్ చేశాడు శివ. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

rajinikanth Peddanna movie stills జీ సినిమాలు సమీక్ష :

రజనీకాంత్ సినిమా రిలీజ్ అంటే 2 నెలల ముందే హంగామా మొదలవుతుంది. కనీసం నెల ముందు అయిన హడావుడి ఉంటుంది. కానీ ఈసారి అలాంటివేం లేకుండా సైలెంట్ గా రజినీ సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. అజిత్ కి వరుసగా బ్లాక్ బస్టర్స్ అందించిన మాస్ డైరెక్టర్ శివ రజినీ తో సినిమా చేస్తున్నాడనే వార్త వచ్చినప్పటి నుండే పెద్దన్న పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రజినీ ని దర్శకుడు శివ తన మార్క్ మాస్ హీరోగా చూపించడంలో సక్సెస్ సాధించి ఫ్యాన్స్ ని మెప్పించాడు కాకపోతే కథ -కథనం విషయంలో తేడా కొట్టింది.

సినిమా మొదలైన కాసేపటికే వీరన్న... ఎంతో అల్లారు ముద్దుగా చూసుకునే చెల్లెలు వేరే వ్యక్తిని ప్రేమిస్తుందని అతనితో వెళ్ళిపోతుందని సగటు ప్రేక్షకుడు కూడా ముందే ఊహించేస్తాడు. ఇక అక్కడి నుండి ఏమైనా కొత్తగా ఆసక్తిగా ఉంటుందా ? అంటే అదీ లేదు. గతంలో తెలుగులో వచ్చిన 'అన్నవరం','కత్తి','అర్జున్' ఇలా అన్నీ సిస్టర్ సెంటిమెంట్ సినిమాలు గుర్తొస్తూనే ఉంటాయి. ముఖ్యంగా 'అన్నవరం'తో ఎక్కువ పోలికలు ఉన్నాయి.

ఎప్పటి నుండో చూస్తూ వస్తున్న సిస్టర్ సెంటిమెంట్ నే నమ్ముకొని రొటీన్ కథ రాసుకున్న శివ కథనంలో అయిన జాగ్రత్త తీసుకొని ట్రీట్ మెంట్ వేరుగా ప్లాన్ చేసుకొని ఉంటే బెటర్ గా ఉండేది. పోనీ సీన్స్ లో అయినా బలం ఉందా ? అంటే అదీ లేదు. శివ రాసుకున్న సెంటిమెంట్ సీన్స్ లో బలం లేకపోవడంతో అవి పేలవంగా అనిపిస్తాయి. కాకపోతే తన మార్క్ మాస్ యాక్షన్ తో మాత్రం కొన్ని సార్లు రజినీ ఫ్యాన్స్ కి పూనకం తెప్పించాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా డిజైన్ చేసుకున్నాడు శివ.

సినిమా ఆరంభం నుండే ఓవర్ డ్రామా సన్నివేశాలతో విసుగు తెప్పిస్తూ కథను ముందుకు నడిపించాడు శివ. చెల్లెలు వచ్చిన ట్రైన్ లో ప్రయాణికులకు తిను బండారాలు , కూల్ డ్రింక్స్ , కొబ్బరి బొండాలు ఇవ్వడం లాంటివి ఓవర్ గా అనిపిస్తాయి. దానికి సూరి డైలాగ్స్ తో మేనేజ్ చేసినప్పటికీ అతిగానే అనిపించింది. ఇక కొలకత్తా బ్యాక్ డ్రాప్ లో సాగే కథ కూడా ఆసక్తిగా లేదు. కొన్ని సందర్భాల్లో వచ్చే సెంటిమెంట్ సీన్స్ కొన్నేళ్ళ క్రితం వచ్చిన పాత చింతకాయ పచ్చడిలా ఒకప్పటి సినిమాలను గుర్తుచేస్తూ అవుట్ డేటెడ్ అనిపిస్తాయి. రజినీ కాంత్ నటన , యాక్షన్ సన్నివేశాలు, ఇమాన్ బ్యాక్ మ్యూజిక్ మాత్రమే సినిమాకు ప్లస్ పాయింట్స్. అవి మినహాయిస్తే సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమిలేదు. అవుట్ డేటెడ్ స్టోరీతో రొటీన్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన 'పెద్దన్న' ఫ్యాన్స్ ని మోస్తరుగా మెప్పిస్తుంది కానీ మిగతా వారికి మాత్రం నిరాశ కలిగిస్తుంది.

రేటింగ్ 2/5