Movie Review – Pakka Commercial

Friday,July 01,2022 - 02:29 by Z_CLU

నటీనటులు : గోపీచంద్, రాశీఖ‌న్నా, స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్, అజయ్ ఘోష్, ప్రవీణ్, సప్తగిరి తదితరులు

సంగీతం : జేక్స్ బీజాయ్

సినిమాటోగ్ర‌ఫి : క‌ర‌మ్ చావ్ల‌

స‌మ‌ర్ప‌ణ : అల్లు అరవింద్

నిర్మాణం : జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్

నిర్మాత‌ : బ‌న్నీ వాస్

రచన - ద‌ర్శ‌కుడు : మారుతి

విడుదల తేది : 1 జులై 2022

నిడివి : 152 నిమిషాలు

 

కొన్నేళ్ళుగా హిట్ కోసం చూస్తున్న మాచో హీరో గోపీచంద్ 'పక్కా కమర్షియల్' అంటూ ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో గోపీచంద్ సూపర్ హిట్ కొట్టాడా ? మారుతి తన మార్క్ కామెడీతో మరోసారి మెప్పించాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ :

న్యాయమూర్తిగా ఉండే సూర్యనారాయణ (సత్య రాజ్) న్యాయం కోసం కోర్టు గడప తొక్కిన అమూల్య (చిత్ర శుక్ల) కి న్యాయం అందించలేకపోయాననే బాధతో జడ్జ్ గా రిజైన్ చేసి న్యాయస్థానానికి గుడ్ బై చెప్పేసి కిరాణా షాపు పెట్టుకుంటాడు. ఇక చిన్నతనం నుండే న్యాయవాది అవ్వాలనుకునే లక్కీ (గోపీచంద్) ఫైనల్ గా లాయర్ కోటు వేసుకొని కోర్టులో అడుగుపెడతాడు. తన తండ్రిలా నాన్ కమర్షియల్ గా కాకుండా ప్రతీ కేసు విషయంలో కమర్షియల్ గా ఆలోచించి అందినంత డబ్బు దోచేస్తుంటాడు.

సూర్యనారాయణ తను ఎవరి వల్ల న్యాయ స్థానానికి దూరమయ్యాడో అతని కేసునే కొడుకు లక్కీ టేకప్ చేసి కమర్షియల్ రూటులో వెళ్తుండటంతో వివేక్ ( రావు రమేష్)ని నిందితుడిగా కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించాలని మళ్ళీ లాయర్ కోర్టు ధరించి అపోనెంట్ కేసు తీసుకుంటాడు. కమర్షియల్ -నాన్ కమర్షియల్ అంటూ తండ్రి కొడుకుల మధ్య జరిగే కోర్టు కేసులో చివరికి ఎవరు గెలిచారు ? కమర్షియల్ లాయర్ అనిపించుకున్న లక్కీ తన తండ్రికి మనశాంతి లేకుండా చేసిన వివేక్ పై రివేంజ్ తీర్చుకున్నాడా లేదా అనేది మిగతా కథ.

 

నటీ నటుల పనితీరు :

లక్కీ అనే కమర్షియల్ లాయర్ పాత్రలో గోపీచంద్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించాడు. సీరియల్ యాక్టర్ పాత్రతో రాశి ఖన్నా అలరించింది. 'ప్రతీ రోజు పండగే'ని మించిన కేరెక్టర్ దొరకడంతో తన నటనతో మెస్మరైజ్ చేసింది. వివేక్ కేరెక్టర్ లో రావు రమేష్ బాగా ఎంటర్టైన్ చేశాడు. సరికొత్తగా కనిపిస్తూ కామెడీ విలన్ గా మరోసారి మెప్పించాడు. సియా గౌతం, చిత్రా శుక్ల తమ పాత్రలకు న్యాయం చేశారు. గెస్ట్ రోల్ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఆకట్టుకుంది.

అజయ్ ఘోష్ తన మార్క్ కామెడీతో నవ్వించాడు. అక్కడక్కడా కామెడీ వర్కౌట్ అవ్వడానికి ఈ కేరక్టర్ బాగా ఉపయోగపడింది. సప్తగిరి, వైవా హర్ష కామెడీ రొటీన్ గానే ఉంది తప్ప ఎంటర్టైన్ చేయలేదు. న్యాయమూర్తులుగా శుభలేక సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్, జయలలిత ఆకట్టుకున్నారు. ప్రవీణ్ ఎప్పటిలానే ఫ్రెండ్ కేరక్టర్ లో కనిపించాడు. ఇక మారుతి రెగ్యులర్ సినిమాల్లో కనిపించే మిగతా నటీనటులు కూడా ఇందులో నటించినప్పటికీ వాళ్ళ కేరక్టర్స్ అంతగా క్లిక్ అవ్వలేదు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు జేక్స్ మ్యూజిక్ పెద్ద మైనస్. కమర్షియల్ సినిమాలకు ముందుగా కావాల్సింది అదిరిపోయే ఆల్బం. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ రాంగ్ ఛాయిస్ అని చెప్పొచ్చు. తన సాఫ్ట్ మ్యూజిక్ ఈ సినిమాకు వర్కౌట్ అవ్వలేదు. ఆల్బమ్ ఒక్క సాంగ్ కూడా సూపర్బ్ అనిపించదు. ఉన్నంతలో పక్కా కమర్షియల్ అంటూ వచ్చే టైటిల్ సాంగ్ ఒక్కటే ఫరవాలేదనిపిస్తుంది కానీ అది కూడా ఎనర్జిటిక్ గా లేదు. డ్యూయట్  కూడా ఆకట్టుకోలేకపోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రం. క‌ర‌మ్ చావ్ల‌ సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సన్నివేశాలను తన కెమెరా వర్క్ తో రిచ్ గా ప్రెజెంట్ చేశాడు. ముఖ్యంగా గోపీచంద్ ని బాగా చూపించాడు. ఎన్ పి ఉద్భ‌వ్ ఎడిటింగ్ ఫరవాలేదు. ర‌వీంద‌ర్ ఆర్ట్ వర్క్ బాగుంది.

మారుతి ఎంచుకున్న కథ-కథనం రొటీన్ గానే ఉన్నాయి. అక్కడక్కడా కొన్ని మాటలు అలరించాయి. దర్శకుడిగా కొన్ని సన్నివేశాలను బాగానే హ్యాండిల్ చేసినప్పటికీ తన రైటింగ్ స్కిల్స్ తో మెస్మరైజ్ చేయలేకపోయాడు. మరీ ముఖ్యంగా మారుతి నుంచి ఆశించే స్థాయిలో కామెడీ పండలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా క్వాలిటీని పెంచాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

'ప్రతీ రోజూ పండగే' లో కామెడీ వర్కౌట్ అవ్వడం, కేరక్టర్స్ క్లిక్ అవ్వడంతో మరోసారి అదే నటీనటులు, అదే ఫార్మాట్ లో ఈ సినిమా చేశాడు మారుతి. మరోసారి కామెడీ మీద బేస్ అయ్యి సినిమా చేయడంతో  ఆ మేజిక్ ని రిపీట్ చేయలేక పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు.

సినిమా ఆరంభంలో సత్యరాజ్ పై వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. ఆ తర్వాత తన కొడుకు లాయర్ గా మారడం నుండి సినిమా కాస్త రొటీన్ ఫార్మేట్ లో సాగుతుంది. హీరో కమర్షియల్ పేరిట విలన్ లా బిహేవ్ చేస్తుంటే 'టెంపర్', 'పటాస్' సినిమాలు గుర్తొస్తాయి. హీరో కేరక్టరైజేషన్ ఆ సినిమాలను గుర్తుచేసి రొటీన్ అనిపిస్తుంది. 'ప్రతీ రోజు పండగే'తో రాశి ఖన్నాని టిక్ టాక్ గర్ల్ గా ప్రెజెంట్ చేసి హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసిన మారుతి, మరోసారి రాశి కోసం ఆ కేరక్టర్ కి ఎక్స్ టెన్షన్ రాసుకున్నాడు. సీరియల్ యాక్టర్ గా రాశికి మంచి ఇంపార్టెంట్ రోల్ క్రియేట్ చేసి కొన్ని సన్నివేశాలతో నవ్వించాడు. కానీ అనవసర సందర్భాల్లో కూడా రాశి పాత్రను ఇరికించి, కథ ఫ్లోను తన చేతులారా తానే తగ్గించుకున్నాడు దర్శకుడు. మరికొన్ని సన్నివేశాల్లో డ్రాగ్ చేస్తూ సీరియల్ డ్రామా క్రియేట్ చేసి బోర్ కొట్టించాడు. రావు రమేష్ ని మాత్రం పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు. రావు రమేష్ , రాశి ఖన్నా నటన సినిమాకు ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. కాకపోతే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో హీరోయిన్ రాశి కనిపించదు. "నేను లేకుండానే క్లైమాక్స్ చూపించేసావ్" అంటూ ఆమెతో ఓ డైలాగ్ చెప్పించి మరీ ఎండ్ చేశారు.

హీరో పక్కా కమర్షియల్ అంటూ చూపించే సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోలేదు. అక్కడ కూడా రొటీన్ సీన్స్ రాసుకున్నాడు మారుతి.  ఎంటర్టైన్ మెంట్ కోటింగ్ తో ఓ రివేంజ్ స్టోరీ రాసుకున్న దర్శకుడు,  ప్రేక్షకులు ఊహించేలానే క్లైమాక్స్  డిజైన్ చేసుకున్నాడు. నెగిటివ్ షేడ్స్ ఉండే హీరో ఓ రీజన్ వల్ల క్లైమాక్స్ లో కచ్చితంగా హీరోగా మారతాడని అందరూ ఊహిస్తారు. ఇందులో కూడా అలాంటి ఓ రీజన్ చెప్పి విలన్ లా కనిపించే గోపీచంద్ ని హీరోని చేశాడు దర్శకుడు. కాకపోతే ఈ టైపు సినిమాల్ని ఇప్పటికే చూసిన అనుభవం ఉన్న ప్రేక్షకులు, ఈ విషయాన్ని సినిమా మొదలైన 40 నిమిషాలకే గుర్తుపట్టేస్తారు. అది కూడా సినిమాకు మైనస్సే. ఫస్ట్ హాఫ్ అంతా గోపీచంద్ -రాశి ఖన్నా ట్రాక్ , కోర్టు డ్రామాతోనే నడిపించిన మారుతి సెకండాఫ్ లో మాత్రం తన 'మార్క్' డైలాగ్ కామెడీతో ఎంటర్టైన్ చేశాడు.

రెండో భాగంలో వచ్చే సెటైరికల్ డైలాగ్స్ కూడా ఆడియన్స్ ని మెప్పిస్తాయి. ముఖ్యంగా అజయ్ ఘోష్ కేరక్టర్ తో మంచి వినోదం అందించి థియేటర్స్ లో ప్రేక్షకుల నవ్వుతో సౌండ్ తెప్పించాడు. అలాగే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ఫరవాలేదనిపిస్తాయి. కానీ ఆ సన్నివేశాలు కూడా గతంలో వచ్చిన సినిమాల్లో చూసేశామనిపిస్తుంది. నిజానికి సినిమాలో వచ్చే కోర్టు రూమ్ డ్రామా ఇంకా బాగా రాసుకోవాల్సింది. అక్కడ ఇంకా కామెడీ క్రియేట్ చేసి ఉంటే ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్ మెంట్ అంది ఉండేది. మారుతి సినిమా అంటే హిలేరియస్ కామెడీ చాలానే ఎక్స్ పెక్ట్ చేస్తారు ఆడియన్స్. అలా థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులకు మారుతి కామెడీతో ఈసారి ఫుల్ మీల్స్ అందలేదు. అక్కడక్కడా కొంత కామెడీ మాత్రమే పండటంతో పక్కా కమర్షియల్ జస్ట్ ఓకె ఎంటర్టైనర్ అనిపించుకుంది.

 

ప్లస్ పాయింట్స్ :

గోపీచంద్

సత్యరాజ్ నటన

రావు రమేష్ , రాశి ఖన్నా కేరెక్టర్స్

ఫైట్స్

సెకండాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్

   

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ -స్క్రీన్ ప్లే

మ్యూజిక్

పేలవమైన సన్నివేశాలు

 

రేటింగ్ : 2.5 /5