Movie Review – Most Eligible Bachelor

Friday,October 15,2021 - 02:03 by Z_CLU

నటీనటులు : అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, ఆమని, మురళి శర్మ, జయ ప్రకాష్, ప్రగతి, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, అభయ్, అమిత్ తదితరులు.

మ్యూజిక్ : గోపీ సుంద‌ర్

సినిమాటోగ్రఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ

దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌

బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్

స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్

నిడివి : 149 నిమిషాలు

విడుదల తేది : 15 అక్టోబర్ 2021

బొమ్మరిల్లు భాస్కర్ సినిమా చేసి చాలా ఏళ్లవుతుంది. అలాగే అఖిల్ కి కూడా చిన్న గ్యాప్ వచ్చింది. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఆ గ్యాప్ మర్చిపోయేలా చేసిందా? ట్రైలర్, సాంగ్స్ తో ఎట్రాక్ట్ చేసిన బ్యాచిలర్ అంచనాలను అందుకొని అలరించాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.

most eligible bachelor

కథ :

అమెరికాలో సెటిలైన హర్ష(అఖిల్) తన పెళ్లిచూపుల కోసం ఇండియా వస్తాడు. అలా ఇండియా వచ్చిన హర్ష కోసం ఉన్నపళంగా  ఓ ఇరవై సంబంధాలు లైన్ లో పెట్టేసి పెళ్లి చూపులు ఎరేంజ్ చేస్తారు.

అలా పెళ్లికి రెడీ అవుతూ పెళ్లిచూపులు చూసే హర్ష కొన్ని రీజన్స్ వల్ల తనకి ఎవరు పర్ఫెక్ట్ అనేది తేల్చుకోలేకపోతాడు. ఈ క్రమంలో జాతకాలు కుదరకపోవడంతో తన ఫ్యామిలీ రిజెక్ట్ చేసిన విభా(పూజ హెగ్డే)కి దగ్గరై తనతో ప్రేమలో పడతాడు.

పెళ్లి పై తనకి ఉన్న ఒపీనియన్ తో స్టాండప్ కామెడీ చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేసే విభ ఓ సందర్భంలో హర్ష లవ్ రిజెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత హర్ష విభాని ఎలా కన్విన్స్ చేశాడు..? ఫైనల్ గా విభా-హర్ష ఎలా కలిశారు ? అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు :

పెళ్లికి రెడీ అయిన కుర్రాడు హర్ష క్యారెక్టర్ లో అఖిల్ మెప్పించాడు. కొన్ని సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. విభా పాత్రలో కనిపించిన పూజ హెగ్డే సినిమాకు హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా పూజ గ్లామర్ సినిమాకు బాగా కలిసొచ్చింది.

గతంలో చేసిన పాత్రే కావడంతో మురళి శర్మ  ఎప్పటిలాగే హీరోయిన్ తండ్రి పాత్రకు న్యాయం చేశాడు. హీరో పేరెంట్స్ గా జయప్రకాష్, ఆమని ఆ పాత్రలకు న్యాయం చేశారు. కానీ ఆమనికి నటించే స్కోప్ లేకపోవడంతో ఆమె దర్శకుడు చెప్పింది చేసి వెళ్ళిపోయింది. స్టోరీ మొత్తం వినే పాత్రల్లో రాహుల్ రవీంద్ర, చిన్మయి పర్వాలేదనిపించారు.

సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ప్రగతి, అమిత్, అభయ్ మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు టెక్నీకల్ గా మంచి సపోర్ట్ అందింది. గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్. అలాగే తన మార్క్ సాంగ్స్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. 'లెహరాయి', 'గుచ్చే గులాబీ' పాటలు ఆకట్టుకున్నాయి. మిగతా పాటలు కూడా పర్వాలేదనిపిస్తాయి. ప్రదీశ్ సినిమాటోగ్రఫీ బాగుంది.  మార్తండ్ కే వెంక‌టేశ్ ఎడిటింగ్ పరవాలేదు.

బొమ్మరిల్లు రాసుకున్న పాయింట్ తో పాటు స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గానే అనిపించాయి.  గీతా ఆర్ట్స్ 2 ప్రొడక్షన్ వాల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

most eligible bachelor movie review in telugu zeecinemalu

జీ సినిమాలు సమీక్ష :

కొన్ని కథలు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. కాకపోతే  ఎంటర్టైనింగ్ గా చెప్తూ ఎంగేజ్ చేయగలగాలి. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమా కోసం అలాంటి రొటీన్ కథే ఎంచుకున్నాడు. కానీ స్క్రీన్ కూడా రొటీన్ గా ఉండడం ఇబ్బంది పెడుతుంది. సినిమా ఆరంభం నుండే కొన్ని సన్నివేశాలు గతంలో వచ్చిన లవ్ స్టోరీస్ ని గుర్తుచేస్తాయి. ఇక పెళ్లి చూపులు కాన్సెప్ట్ కూడా ఇటీవలే వచ్చిన షాదీ ముబారక్ సినిమాను గుర్తుచేస్తాయి. ఆ సన్నివేశాలు ఇంకా ఎంటర్టైనింగ్ గా రాసుకుంటే బాగుండేది. అక్కడ కూడా ఆదరాబాదరాగా తీసినట్టుంది తప్ప ఎంటర్టైనింగ్ గా లేవు. ఇక అక్కడక్కడా వచ్చే కామెడీ కూడా ఔట్ డేటెడ్ అనిపిస్తూ విసుగు తెప్పిస్తుంది. నిజానికి లవ్ రిలేషిన్ షిప్ మీద, అలాగే భార్యభర్తల రిలేషిన్ షిప్ టాపిక్ తో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో What are you expecting from Married life? అనే క్వశ్చన్ రైజ్ చేసి దానికి బొమ్మరిల్లు భాస్కర్ చెప్పాలనుకున్నది కన్విన్సింగ్ గా చెప్పలేకపోయాడు. ఏ సినిమాకైనా క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్. పైగా భాస్కర్ క్లైమాక్స్ లు బాగుంటాయి. కానీ ఈసారి క్లైమాక్స్ కూడా వర్కౌట్ చేయలేకపోయాడు దర్శకుడు. ఇక సినిమాలో పదిహేనేళ్ల క్రితం వచ్చిన బొమ్మరిల్లు షేడ్స్ కూడా కనిపిస్తాయి. కొడుకు ని కూతురి ని అర్థం చేసుకోలేని తండ్రులు పాయింట్ ని ఇందులో కూడా ఇంక్లూడ్ చేశాడు.

ముఖ్యంగా పెళ్లి గురించి తను చెప్పాలనుకున్న విషయాన్ని ముందు నుండి రొటీన్ ఫార్మేట్ లో చూపిస్తూ రావడంతో సరిగ్గా చెప్పలేకపోయాడు. దాంతో కథలో పండాల్సిన ఎమోషన్ పండలేదు. కొన్ని సన్నివేశాలు దర్శకత్వంలో లోపాలు చూపించేలా ఉన్నాయి. హర్ష-విభా లవ్ ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. వారి మధ్య మంచి బాండింగ్ కుదిరే సన్నివేశాలు పడలేదు. అలాగే క్యారెక్టరైజేషన్ కూడా పూర్ అనిపించాయి. సినిమాలో అఖిల్, పూజ హెగ్డే నటన, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ హైలైట్ గా నిలిచాయి.

ఓవరాల్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రొటీన్ కంటెంట్ తో మెప్పించలేకపోయింది.

రేటింగ్ : 2.5 /5