Micro Review – Pogaru

Wednesday,February 24,2021 - 07:15 by Z_CLU

శాండిల్ వుడ్ నుంచి పాన్-ఇండియా సినిమాలొస్తున్నాయి. అదే టైమ్ లో పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమాలు కూడా వస్తున్నాయి. తెలుగులో ఆల్రెడీ వాడి పడేసిన ఫార్ములా మూవీస్ ను అక్కడి మేకర్స్ కొత్తగా ట్రై చేస్తున్నారు. అందులో తప్పులేదు. కానీ అలా ప్రయత్నించిన సినిమాల్ని మళ్లీ తెలుగులోకి తీసుకురావడం తప్పు. పొగరు సినిమా అలాంటిదే.

ఇందులో హీరో మాస్. లుక్ మాస్, బిహేవియర్ కూడా మాస్. తల్లి అంటే గిట్టదు. ఆమె రెండో పెళ్లి చేసుకుందని కోపం. మరోవైపు కాలనీ కోసం ప్రాణలు సైతం ఇచ్చేంత తెగింపు. ఇంకోవైపు హీరోయిన్ ప్రేమ కోసం తపన. హీరో షేడ్స్ ఇలా ఉంటాయి. ఇలాంటి హీరో ఇంటర్వెల్ కు వచ్చేసరికి మారిపోతాడు. సెకండాఫ్ స్టార్ట్ అయ్యేసరికి హీరోయిన్ దగ్గరవుతుంది. క్లైమాక్స్ కు ముందే తల్లి కూడా చేరువౌతుంది. క్లైమాక్స్ లో విలన్లు ఖతం.

ఇలాంటి ఫార్ములా మూవీస్ తెలుగులో చాలా వచ్చాయి. చిరంజీవి, మోహన్ బాబు నుంచి ఇప్పటితరం హీరోలు చాలామంది నమిలేసి వదిలేశారు. సో.. ఇలాంటి ఫార్ములా కథతో వచ్చిన పొగరు తెలుగులో హిట్టవుతుందని ఎవ్వరూ ఊహించరు. కథలో కొత్తదనం లేకపోగా.. ప్రతి సీన్ ఊహించినట్టే సాగడం దీనికి మరో మైనస్ పాయింట్. చివరికి ఈ రొటీన్ కథతో రష్మిక కూడా మెప్పించలేకపోయింది. పక్కా మాస్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు మాత్రమే పొగరు నచ్చుతుంది.

నటీనటులు - ధ్రువ స‌ర్జా, ర‌ష్మికా మంద‌న్న‌, సంప‌త్ రాజ్‌, ధ‌నంజ‌య్‌, ర‌విశంక‌ర్‌, ప‌విత్రా లోకేష్‌ తదితరులు.. సంగీతం: చ‌ంద‌న్ శెట్టి సినిమాటోగ్రీఫీ: ఎస్‌.డి. విజ‌య్ మిల్ట‌న్‌ నిర్మాత‌: బి.కె. గంగాధ‌ర్‌ ద‌ర్శ‌క‌త్వం: న‌ంద‌కిశోర్‌ బ్యాన‌ర్‌: శ్రీ జ‌గ‌ద్గురు మూవీస్‌ సెన్సార్ - U/A రిలీజ్ డేట్ - ఫిబ్రవరి 19, 2021 రేటింగ్ - 2.25/5