Kiran Abbavaram’s ‘Sammathame’ Movie Review

Friday,June 24,2022 - 03:22 by Z_CLU

నటీ నటులు : కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి, గోపరాజు రమణ , శివన్నారాయణ, అన్నపూర్ణమ్మ, సితార, సప్తగిరి , రాజేంద్ర తదితరులు.

సంగీతం: శేఖర్ చంద్ర

కెమెరా : సతీష్ రెడ్డి మాసం

ఎడిటింగ్ : విల్పవ్

నిర్మాణం : యూజీ ప్రొడక్షన్స్

నిర్మాత: కంకణాల ప్రవీణ

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి

నిడివి : 130 నిమిషాలు

విడుదల తేది : 24 జూన్ 2022

కిరణ్ అబ్బవరం హీరోగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'సమ్మతమే' ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సాంగ్స్ , ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా ఫైనల్ గా కంటెంట్ తో మెప్పించిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ :

చిన్నతనంలోనే అమ్మ ప్రేమకి దూరమైన కృష్ణ (కిరణ్ అబ్బవరం) అలాంటి ప్రేమ మళ్ళీ తన భార్య రూపంలో పొందాలనుకుంటాడు. అందుకే ఎవ్వరినీ ప్రేమించకుండా పెళ్ళయ్యాక తన భార్యని మాత్రమే ప్రేమించాలని డిసైడ్ అవుతాడు. తనకి నచ్చిన అమ్మాయి కోసం ఎదురుచూస్తున్న సమయంలో శాన్వి (చాందిని చౌదరి) ని తొలి చూపులోనే చూసి ప్రేమలో పడతాడు.

కట్ చేస్తే ప్రేమలో పడిన శాన్వితోనే కృష్ణ కి నిశ్చితార్థం జరుగుతుంది. అసలు కృష్ణ కోరుకునే క్వాలిటీస్ శాన్విలో ఉన్నాయా ? ఆమె ఇష్టాలను గౌరవించి కృష్ణ చివరికి 'సమ్మతమే' అన్నాడా లేదా అనేది సినిమా కథ.

నటీ నటుల పనితీరు :

మంచి కథలు , పాత్రలు ఎంచుకుంటూ హీరోగా యూత్ లో కొంత క్రేజ్ తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం మరోసారి కృష్ణ పాత్రతో ఆకట్టుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో తన నటన ఆకట్టుకుంది. కేరెక్టరైజేషణ్ వీక్ గా ఉండటంతో శాన్వి చాందిని చౌదరి ఫర్వాలేదనిపించుకుంది తప్ప బెస్ట్ ఇవ్వలేకపోయింది. హీరో తండ్రి పాత్రలో గోపరాజు రమణ నేచురల్ యాక్టింగ్ బాగుంది. తక్కువ సన్నివేశాల్లో కనిపించినప్పటికీ సితార తన నటనతో అమ్మ పాత్రలో ఆకట్టుకుంది. హీరోయిన్ తండ్రి పాత్రలో శివన్నారాయణ తల్లి పాత్రలో నటించిన నటి బాగా నటించారు. అన్నపూర్ణమ్మకి వంటలు చేసే , తన మందు వెతుక్కునే రెండు మూడు సన్నివేశాలు మాత్రమే దక్కాయి. సప్తగిరి , రాజేంద్ర కామెడీ వర్కౌట్ అవ్వలేదు. చమ్మక్ చంద్ర , సద్దాం , యదమ్మరాజు నవ్వించలేకపోయారు.

సాంకేతిక వర్గం పనితీరు :

శేఖర్ చంద్ర మ్యూజిక్ బాగుంది. ఒక లవ్ స్టోరీకి ఎలాంటి సాంగ్స్ పడాలో సరిగ్గా అలాంటి సాంగ్స్ ఇచ్చాడు. "కృష్ణ అండ్ సత్యభామ", "బుల్లెట్టు లా" పాటలు ఆకట్టుకున్నాయి. మిగతా పాటలు ఫర్వాలేదు. పాటలకు లిరిక్స్ కూడా బాగున్నాయి. సతీష్ రెడ్డి కెమెరా వర్క్ బాగుంది. కొన్ని ఫ్రేమ్స్ ఎట్రాక్ట్ చేసెలా ఉన్నాయి. విప్లవ్ ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉంది. ఏ మాత్రం లెంత్ పెంచినా సినిమా బాగా బోర్ కొట్టేది. సుధీర్ మాచర్ల ఆర్ట్ వర్క్ బాగుంది. కొన్ని సందర్భాల్లో డైలాగ్స్ బాగున్నాయి.

గోపీనాథ్ రెడ్డి రైటింగ్ అండ్ డైరెక్షన్ వీక్ అనిపించాయి. పాయింట్ బాగున్నప్పటికీ ఎక్స్ పీరియన్స్ లేకపోవడంతో సరిగ్గా డీల్ చేయలేకపోయాడు దర్శకుడు. ప్రొడక్షన్ వేల్యూస్ షార్ట్ ఫిలింని తలిపించాయి.

sammathame

జీ సినిమాలు సమీక్ష :

ఏ లవ్ స్టోరీకయినా హీరో -హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి. అలాగే లవ్ ట్రాక్ లో ఇంప్రెస్ చేసే సీన్స్ రాసుకోవాలి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే మీద ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. గోపీనాథ్ నాథ్ రెడ్డి వీటి మీద తక్కువ వర్క్ చేయడం వల్ల 'సమ్మతమే' పాస్ మార్కులు అందుకోలేకపోయింది. దర్శకుడు తను ఎంచుకున్న చిన్న పాయింట్ తో రెండు గంటల సినిమా తీసి మెప్పించడంలో విఫలం అయ్యాడు. షార్ట్ ఫిలిం చేయల్సిన లైన్ పట్టుకొని సినిమా తీయాలంటే చాలా ప్లాన్ చేసుకోవాలి. ఆ విషయంలో డెబ్యూ డైరెక్టర్ తడబడ్డాడు.

కిరణ్ అబ్బవరం లాంటి హీరోని పెట్టుకొని ఎనర్జిటిక్ కేరెక్టర్ రాసుకోకపోవడం దర్శకుడి మిస్టేక్. బహుశా కథకు తగ్గట్టుగా హీరోని గుడ్ బాయ్ లా చూపించాలనుకున్నాడు కావోచ్చు కానీ ఈ హీరోని చూసి ఎక్స్ పెక్ట్ చేసి వచ్చే వారిని కృష్ణ కేరెక్టర్ నిరాశ పరుస్తుంది. పైగా హీరో కేరెక్టర్ ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా కాకుండా అబద్దాలు చెప్పని ట్రెడిషనల్ గా ఉండే మంచి అమ్మాయి కోసం ఎదురుచూసే అబ్బాయిగా చూపించాడు. ఇప్పటి ట్రెండ్ లో కూడా అలాంటి అబ్బాయిలు ఉన్నారు లేరని కాదు. కానీ వారికంటే ట్రెండ్ ని ఫాలో అయ్యే ఎక్కువ పర్సెంటేజ్ కి హీరో కేరెక్టర్ కనెక్ట్ అయితే రిజల్ట్ మరోలా ఉంటుంది.

లవ్ స్టోరీలో ఎక్స్ పెక్ట్ చేసే రొమాన్స్ మోతాదు కూడా ఇందులో తక్కువే ఉంది. సెకండాఫ్ లో కిస్ సీన్ తప్ప యూత్ ని ఎట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ పెద్దగా లేవు. పబ్ లో హీరో -హీరోయిన్ మాట్లాడుకునే సన్నివేశం కొంతలో పరవాలేదనిపిస్తుంది.  హీరోయిన్ చాందిని  షార్ట్ ఫిలిం హీరోయిన్ లానే కనిపించింది తప్ప హాట్ అందాలతో మెస్మరైజ్ చేయలేకపోయింది. కనీసం పెర్ఫార్మెన్స్ అయినా బెటర్ గా ఉండాల్సింది అక్కడ కూడా చాందిని కి పాస్ మార్కులు పడలేదు. కిరణ్ మాత్రం తన సాఫ్ట్ రోల్ తో ఉన్నంతలో సినిమాను ముందుకు నడిపించాడు. సినిమా ఆరంభంలో వచ్చే చైల్డ్ హుడ్ సీన్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. సినిమా అంతా నేచురల్ గా రియలిస్టిక్ వేలో తీసే ప్రయత్నంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కానీ సినిమాకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అలాగే బలమైన సన్నివేశాలు ఆకట్టుకునే స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తన టాలెంట్ చూపించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ ని కొంత వరకూ బాగానే నడిపించినా సెకండాఫ్ వకొచ్చేసరికి బాగా తడబడ్డాడు. దీంతో సెకండాఫ్ లో వచ్చే సన్నివేశాలు పేలవంగా అనిపిస్తాయి. అక్కడ సప్తగిరి -రాజేంద్ర కామెడీ ట్రాక్ కూడా వర్కౌట్ అవ్వలేదు.

నిజానికి దర్శకుడు కొంత మంది కమేడియన్లను పెట్టుకున్నాడు కానీ వారితో మంచి కామెడీ పండించి థియేటర్స్ లో ప్రేక్షకులను నవ్వించలేకపోయాడు. గోపీనాథ్ రెడ్డి కి డెబ్యూ సినిమా కావడంతో చిన్న లైన్ తో పెద్ద సినిమా తీయడంలో ఫెయిల్ అయ్యాడు. ముఖ్యంగా కథలో ఎలాంటి ట్విస్టులు లేకుండా ఫ్లాట్ నెరేషన్ తో సినిమాను నడిపించిన విధానం నిరాశ పరుస్తుంది.

కిరణ్ అబ్బవరం నటన , సాంగ్స్ , విజువల్స్ , కొన్ని సన్నివేశాలు సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా లవ్ ట్రాక్ , స్క్రీన్ ప్లే , బలమైన సీన్స్ లేకపోవడం, ఎలాంటి మూపులు లేని ఫ్లాట్ నెరేషన్, రొటీన్ క్లైమాక్స్ సినిమాకు మైనస్. ఓవరాల్ గా 'సమ్మతమే' పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది.

 

రేటింగ్ : 2.5 /5