Kiran Abbavaram’s ‘Meter’ Movie Review

Friday,April 07,2023 - 03:41 by Z_CLU

నటీ నటులు : కిరణ్ అబ్బవరం, అతుల్య రవి

సంగీతం: సాయి కార్తీక్

డీవోపీ: వెంకట్ సి దిలీప్

ప్రొడక్షన్ డిజైనర్: JV

డైలాగ్స్: రమేష్ కడూరి, సూర్య

సమర్పకులు: నవీన్ యెరనేని, రవిశంకర్ యలమంచిలి

బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్‌, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్

నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు

కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: రమేష్ కడూరి

విడుదల తేదీ : 7 ఏప్రిల్ 2023

లవ్ స్టోరీస్ , డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తక్కువ టైమ్ లో మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న కిరణ్ అబ్బవరం తొలి సారి మాస్ మీటర్ లో కమర్షియల్ సినిమా చేసి థియేటర్స్ లోకి వచ్చాడు. మరి కిరణ్ మాస్ యాక్షన్ కమర్షియల్ సినిమాతో సక్సెస్ అందుకున్నాడా ? కొత్త దర్శకుడు మెప్పించాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ : 

పోలీస్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేసే వెంకట రత్నం తన కొడుకు అర్జున్ కళ్యాణ్ ఎప్పటికైనా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కోరుకుంటాడు. ఆ దిశగా కొడుకుని పోలీస్ డిపార్ట్ మెంట్ లోకి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తాడు. అయితే చిన్నతనంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ కారణం చేత పోలీస్ ఉద్యోగానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న అర్జున్ కళ్యాణ్ తండ్రి కోరిక మేరకు సర్కిల్ ఇన్స్ పెక్టర్ అవుతాడు. అలా ఇష్టం లేని ఉద్యోగం చేస్తూ ఆ డిపార్ట్ మెంట్ నుండి ఎప్పుడెప్పుడు బయటికి వచ్చేద్దామా ? అని చూస్తున్న అర్జున్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ సహాయంతో ఆ ఉద్యోగం నుండి తొలగించబడతాడు.

అనుకోకుండా ఓ వ్యక్తిని  కాల్చే క్రమంలో తన తండ్రి ను ఘాట్ చేస్తాడు అర్జున్ కళ్యాణ్. ఆ తర్వాత ఏమైంది ? అసలు ఆ వ్యక్తి ఎవరు ? దాని వెనుక ఉన్నది ఎవరు ? ఫైనల్ గా మళ్ళీ  ఖాఖీ ధరించి పోలీస్ డిపార్ట్ మెంట్ లో జరిగిన ఓ తప్పు బయటపడకుండా అర్జున్ కళ్యాణ్ ఏం చేశాడు ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు : 

హీరో కిరణ్ అబ్బవరం తన ఎనర్జీ తో ఆకట్టుకున్నాడు కానీ నటుడిగా ఇంకా షైన్ అవ్వాల్సి ఉంది. కొన్ని సన్నివేశాల్లో ఈ హీరో ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ చూస్తే నటనలో ఇంకా ఓనమాల దగ్గరే ఉన్నడనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ లో ఎనర్జీ కనిపించింది కానీ మాస్ హీరో గా పూర్తిగా మెప్పించలేకపోయాడు. అతుల్యా రవి హీరోయిన్ గా ఫరవాలేదనిపించుకుంది. ఆమెకు కథలో పెద్దగా ఇంపార్టెన్స్ దక్కలేదు. సప్తగిరి కామెడీ వర్కవుట్ అవ్వలేదు. కిరణ్ అబ్బవరం తండ్రి పాత్రలో కనిపించిన నటుడు తన నటనతో ఆకట్టుకున్నాడు. విలన్ పాత్ర అతని నటన రొటీన్ గానే ఉన్నాయి. పోసాని కృష్ణ కూడా గతంలో ఎన్నో సినిమాలో చేసిన పాత్రలోనే కనిపించి అలరించలేకపోయాడు. నటీ నటులంతా ఫరవాలేదనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

సినిమాకు సంబంధించి యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. సెకండాఫ్ లో వచ్చే ఫైట్లు మాస్ ఆడియన్స్ ను ఆకట్టకునేలా ఉన్నాయి.వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ బాగుంది. సాయి కార్తీక్ మ్యూజిక్ పరవాలేదు. మాస్ కమర్షియల్ సినిమాలకు పడాల్సిన సాంగ్స్ దీనికి సెట్ అవ్వలేదు. క్లైమాక్స్ కి ముందు వచ్చే సాంగ్ జస్ట్ పరవాలేదనిపించింది. అక్కడక్కడా వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు.

రమేష్ కడూరి, సూర్య డైలాగ్స్ కొన్ని సందర్భాలలో ఆకట్టుకున్నాయి. రమేష్ కడూరి ఎంచుకున్న కథ  రొటీన్ గా ఉంది. ఇక కథనం కూడా పరమ రొటీన్ గా రాసుకోవడం సినిమాకు పెద్ద మైనస్.  వెల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష : 

ఒకటి రెండు హిట్లు కొట్టిన కుర్ర హీరోలు మాస్ కమర్షియల్ సినిమా చేసిన ప్రతీ సారి ఎదురుదెబ్బలే తగిలాయి. ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం మాస్ మీటర్ తో ఎలాంటి హిట్ కొడతాడా ? అనే సందేహం అందరికీ వచ్చింది. అయితే తన మాస్ సినిమాను కూడా ఎప్పటిలానే కొత్త దర్శకుడితోనే ప్లాన్ చేసుకున్నాడు కిరణ్. ఇప్పుడు వచ్చే దర్శకులు తమ మొదటి సినిమాకు సరికొత్త కథ రాసుకొని డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ లు కొడుతున్నారు. కానీ రమేష్ కడూరి మాత్రం చాలా మంది దర్శకులు ఆలోచించినట్టే మాస్ కమర్షియల్ కథతో వస్తే హిట్ పక్కా అనుకొని మీటర్ తీశాడు.

మీటర్ కోసం గతంలో ఎన్నో సినిమాళ్లో చూసిన కంటెంట్ నే తీసుకొని దానికి కొత్త ట్రీట్ మెంట్ ఇవ్వకుండా పాత పద్దతిలోనే స్క్రీన్ ప్లే రాసుకొని దర్శకుడిగా విఫలం అయ్యాడు రమేష్. నిజానికి హీరోను బట్టి దర్శకుడు కథ , స్క్రీన్ ప్లే ముఖ్యంగా సన్నివేశాలు రాసుకోవాలి. ఇలాంటి కమర్షియల్ మీటర్ సినిమాల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. కిరణ్ అబ్బవరం లాంటి నాలుగు సినిమాల అనుభవం ఉన్న యంగ్ హీరోతో ఇలాంటి మాస్ సినిమా చేయాలనుకోవడమే పెద్ద టాస్క్. పైగా రొటీన్ కంటెంట్ తో వస్తే ఎలా ? మీటర్ విషయంలో అదే జరిగింది. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఎక్కువగా కళ్యాణ్ రామ్ 'పటాస్' గుర్తొస్తుంది. ఇక మగాళ్ళంటే ఏ మాత్రం ఇష్టం లేని హీరోయిన్  రెండు సీన్లకే హీరోకి పడిపోవడం, తర్వాత వారి మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా తేడా కొట్టింది.

పోలీస్ పాత్ర , విలన్ కి ఛాలెంజ్ విసిరే సీన్స్ తో కిరణ్ ఈ కథలో తెలిపోయాడు. మొన్నటి వరకు యూత్ సినిమాలతో ఆకట్టుకున్న కిరణ్ సడెన్ గా పంచ్  డైలాగులు చెప్తూ, ఫైట్లు చేస్తుంటే ఇప్పుడే ఈ కుర్ర హీరోకి ఈ తరహా సినిమా అవసరమా ? అనిపించడం ఖాయం. అలా అని కుర్ర హీరో మాస్ కమర్షియల్ సినిమా చేయకూడదని కాదు కానీ కిరణ్ లాంటి యంగ్ హీరోలకి ఇలాంటి కథలని మోయగలిగే పరిణితి కావాలి. అందుకే ఇప్పటికీ చాలా మంది యంగ్ హీరోలు మాస్ యాక్షన్ కమర్షియల్ సినిమా కథల జోలికి వెళ్ళకుండా జాగ్రత్త పడతారు. నాని లాంటి హీరోకే మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి చాలా టైమ్ పట్టింది. కిరణ్ లాంటి యంగ్ హీరో కాప్ రోల్ తో యాక్షన్ సినిమా చేయడానికి ఇంకా టైమ్ పడుతుంది. ఈ లోపే యంగ్ హీరో కాస్త తొందర పడ్డాడు. పైగా రొటీన్ కంటెంట్ తో వచ్చి అలరించలేకపోయాడు.

మీటర్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఫైట్లు , డైలాగులు , ఐటం సాంగ్ , హీరోయిజం.. ఇలా అన్నీ ఉన్నప్పటికీ వాటితో టికెట్టు కొన్న ప్రేక్షకుడు సంతృప్తి చెందని పరిస్థితి. రొటీన్ స్టోరీ -స్క్రీన్ ప్లే , విలన్ తేలిపోవడం , ఫ్రెష్ గా అనిపించే ఒక్క సీన్ కూడా లేకపోవడం పెద్ద మైనస్. ఇక లాజిక్స్ లేని సన్నివేశాలు కూడా మైనస్ అనిపిస్తాయి. ఓవరాల్ గా మీటర్ రొటీన్ యాక్షన్ డ్రామాగా ఆకట్టుకోలేక మిస్ ఫైర్ అయింది.

రేటింగ్ : 2 /