Kamal Haasan’s ‘Vikram’ Movie Review

Friday,June 03,2022 - 04:37 by Z_CLU

నటీ నటులు  : కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, కాళిదాస్ జయరామ్, నరేన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ తదితరులు

సంగీతం : అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్

ఎడిటర్ : ఫిలోమిన్ రాజ్

నిర్మాణం  : రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్

నిర్మాతలు : కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్

తెలుగు రిలీజ్ : 'శ్రేష్ట్ మూవీస్'  సుధాకర్ రెడ్డి

రచన - దర్శకత్వం: లోకేష్ కనగరాజ్

నిడివి : 172 నిముషాలు

విడుదల తేది : 3 జూన్ 2022

కమల్ హాసన్ హీరోగా ఫహద్ ఫాసిల్ , విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన 'విక్రమ్' ఓ మోస్తారు అంచనాలతో నేడే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 'ఖైది','మాస్టర్' సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్న లోకేష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా ? కమల్ ఈ సినిమాతో హిట్టు అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

Kamal hassan vikram movie 2

కథ :

చెన్నైలో సంతానం(విజయ్ సేతుపతి) కి చెందిన భారీ డ్రగ్స్ ఉన్న కంటైనర్ మిస్సవుతుంది. ఈ క్రమంలో ఆ కంటైనర్ పట్టుకొని దాచిన ప్రభంజన్ అనే ఆఫీసర్ ని హత్య చేస్తాడు సంతానం. ఆ తర్వాత అతడి తండ్రి కర్ణన్ (కమల్ హాసన్) కూడా హత్య చేయబడతాడు. మరో వైపు ఓ ముసుగు ముఠా వరుసగా ఆఫీసర్లను చంపుతూ ఉంటారు.

ఈ కేసుని ఛేదించడానికి స్పెషల్ ఆఫీసర్ అమర్ (ఫహద్ ఫాసిల్) రంగంలోకి దిగుతాడు. అమర్ సీన్ లోకి ఎంటరై కర్ణన్ హత్య పై ఎంక్వైరీ చేస్తుంటాడు. ఈ క్రమంలో ముసుగు ముఠా వెనుక ఉన్నది విక్రమ్ అని తెలుసుకుంటాడు.  అసలు విక్రమ్ ఎవరు  ? అతని గతం ఏమిటి ?  విక్రమ్ కి కర్ణన్ కి కనెక్షన్ ఏమిటి ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

కమల్ హాసన్ నటన గురించి కొత్తగా చెప్పేదేముంది ? కర్ణన్ పాత్రలో మెస్మరైజ్ చేశాడు కమల్. ఫస్ట్ హాఫ్ లో కాసేపే కనిపించినప్పటికీ సెకండాఫ్ లో తన పాత్రతో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. యాక్షన్ ఎపిసోడ్స్ లో , ఎమోషనల్ సన్నివేశాల్లో కమల్ తన పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేశాడు. స్పెషల్ ఆఫీసర్ గా ఫహద్ ఫాసిల్ తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నాడు. విజయ్ సేతుపతి  మరోసారి విలన్ గా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో నటనతో అలరించాడు. కాళిదాస్ జయరామ్, నరేన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు అనిరుద్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎస్సెట్ అని చెప్పొచ్చు. కమల్ ఇంట్రో  కోసం అనిరుద్ కంపోజ్ చేసిన సాంగ్ ఆకట్టుకుంది. ఇక తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు అనురుద్. సినిమా చూసాక అనిరుద్ స్కోర్ ఎక్కువగా గుర్తొస్తుంది. గిరీష్ గంగాధరన్ కెమెరా వర్క్ బాగుంది. కొన్ని షాట్స్ ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. ఫిలోమిన్ రాజ్ తన ఎడిటింగ్ తో ఎంగేజ్ చేశాడు. కానీ కాస్త లెంగ్త్ తగ్గించి కొన్ని అనవసరమైన సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.

లోకేష్ కనగరాజ్ టేకింగ్ ఆకట్టుకుంది. ముఖ్యంగా లోకేష్ స్టైలిష్ మేకింగ్ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. దర్శకుడిగా మరోసారి తన పాత్రను చక్కగా నిర్వర్తించాడు. ప్రొడక్షన్ వేల్యూస్ సినిమా క్వాలిటీ ని పెంచాయి.

జీ సినిమాలు సమీక్ష :

స్టైలిష్ యాక్షన్ డ్రామా సినిమాలకు ఎప్పుడూ ఓ సెపరేట్ ఆడియన్స్ ఉంటారు. మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ప్లాన్ చేసుకుంటే చాలు ఈ జోనర్ లో సినిమా పాస్ అయిపోతుంది. ఇదే నమ్మకంతో లోకేష్ కనగరాజ్ మరోసారి 'విక్రమ్' తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.  ఈ మధ్య వరుసగా అపజయాలు అందుకుంటూ కెరీర్ ని కొనసాగిస్తున్న కమల్ హాసన్ ని తన స్టైల్ ఆఫ్ యాక్షన్ సినిమాతో ప్రెజెంట్ చేసి మెప్పించాడు. కమల్ కూడా తన వయసుతో సంబంధం లేకుండా ఇలాంటి యాక్షన్ సినిమా చేయడం సాహసమే. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో కమల్ నటన ఆడియన్స్ చేత విజిల్స్ వేయించేలా ఉంది.

కథలోకి వెళ్ళడానికి కాస్త టైం తీసుకున్న లోకేష్ కనగరాజ్ ఫస్ట్ హాఫ్ అంతా అమర్ కేరెక్టర్ ఎంక్వైరీ చేసే సీన్స్ తోనే సినిమాను నడిపించాడు. మధ్యలో అక్కడక్కడా కమల్ ని చూపిస్తూ అలాగే డ్రగ్ తయారి చేసే సంతానం కేరెక్టర్ తాలూకు విలనిజం చూపించాడు. మధ్యలో ముసుగు ముఠా హత్యలు చూపిస్తూ ఏం జరగుతుంది ? అనే ఆసక్తి కలిగించాడు. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసి అక్కడి నుండి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళాడు. యాక్షన్ ఎపిసోడ్స్ తో అలరింప జేస్తూ పవర్ పాక్డ్ యాక్షన్ డ్రామాగా సినిమాను నడిపించాడు. నిజానికి ఇంటర్వెల్ వరకూ ప్రేక్షకుడు సినిమాకు పెద్దగా కనెక్ట్ అవ్వడు. కానీ ఇంటర్వెల్ తర్వాత సినిమాకి కనెక్ట్ అవుతాడు. అక్కడి నుండి యాక్షన్ బ్లాక్స్ తో మెస్మరైజ్ చేస్తూ ఎంటర్టైన్ చేశాడు లోకేష్. కాకపోతే లోకేష్ గత సినిమాల్లో లానే ఈ సినిమాను కూడా అదే రీతిలో హ్యాండిల్ చేశాడు. ముఖ్యంగా మాస్టర్ లో విలన్ గా కనిపించిన విజయ్ సేతుపతి నే మళ్ళీ విలన్ గా తీసుకోవడం , ఖైదీ తరహాలోనే యాక్షన్ బ్లాక్స్ డిజైన్ చేసుకోవడం చేశాడు. అందువల్ల ఆ సినిమాలు గుర్తొస్తాయి.

కమల్ విక్రమ్ గా పరిచయం అయ్యే ముందు వచ్చే సీక్వెన్స్ , కమల్ కేరక్టర్ , యాక్షన్ ఎపిసోడ్స్ , లోకేష్ రైటింగ్ ప్లస్ మేకింగ్ , సెకండాఫ్ స్క్రీన్ ప్లే , ఫహద్ ఫాసిల్ , విజయ్ సేతుపతి పెర్ఫార్మెన్స్ , అనిరుద్ స్కోర్,  ప్రీ క్లైమాక్స్ కి ముందు వచ్చే లేడీ ఫైట్ , గూస్ బంప్స్ తెప్పించే క్లైమాక్స్ సినిమాలో మేజర్ హైలైట్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ లో కాస్త బోర్ కొట్టే సన్నివేశాలు , లెంగ్తీ రంటైం , క్లైమాక్స్ తర్వాత వచ్చే సూర్య సీన్ సినిమాకు మైనస్ అనిపిస్తాయి. సూర్య క్యామియో ఏదో కొత్తగా ఉంది అనే ఫీలింగ్ కలుగుతుంది తప్ప పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. సూర్య క్యామియో ని 'విక్రమ్ 2' లీడ్ కోసం మాత్రమే వాడుకున్నాడు లోకేష్.  ఇక ఫస్ట్ హాఫ్ అంతా రివేంజ్ డ్రామాగా కథను నడిపించి సెకండాఫ్ నుండి అసలు కథలోకి తీసుకెళ్ళాడు దర్శకుడు. ఇప్పటికే తమిళ్ లో చాలా సినిమాల్లో చూపించిన డ్రగ్ మాఫియానే విక్రమ్ కోసం కథా వస్తువుగా తీసుకున్నాడు. కాకపోతే ఇంకాస్త డెప్త్ లో డ్రగ్స్ గురించి చెప్పే ప్రయత్నం చేశాడు.  యాక్షన్ బ్లాక్స్ తో మాస్ ఆడియన్స్ కి 'విక్రమ్' ఫుల్ మీల్స్ పెడతాడు. మిగతా వారిని మాత్రం ఓ మోస్తరుగా మెప్పిస్తాడు.

రేటింగ్ : 2.75/5

   
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics