‘Japan’ Movie Review
Friday,November 10,2023 - 04:02 by Z_CLU
నటీ నటులు : కార్తి, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, విజయ్ మిల్టన్ తదితరులు.
డీవోపీ: ఎస్. రవి వర్మన్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
నిర్మాణం : డ్రీమ్ వారియర్ పిక్చర్స్
నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
దర్శకత్వం: రాజు మురుగన్
విడుదల తేది : 10 నవంబర్ 2023
రన్ టైమ్ : 156 నిమిషాలు
కార్తీ 25 వ సినిమా , డిఫరెంట్ కేరెక్టర్ , ఎట్రాక్ట్ చేసిన టీజర్ , ట్రైలర్ ఇవన్నీ 'జపాన్' సినిమా పై మంచి ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. మరి జపాన్ ఆ అంచనాలను రీచ్ అయ్యిందా ? కార్తీ తన 25 వ సినిమాతో ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పించారు ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.
కథ :
హైదరాబాద్ రాయల్ బంగారం షాప్ లో రెండు వందల కోట్ల విలువైన నగలు దొంగతనం జరుగుతుంది. ఆ కేసును విచారిస్తున్న తెలంగాణ పోలీస్ ల కన్ను చిన్నతనం నుండి బంగారం దొంగతనం చేస్తూ గజదొంగగా మారి పెద్ద స్థాయి కి చేరిన జపాన్ ముని (కార్తీ) పై పడుతుంది. దీంతో జపాన్ ను పట్టుకునేందుకు శ్రీధర్ (సునీల్) , భవానీ (విజయ్ మిల్టన్) రెండు టీములుగా విడిపోయి ప్రయత్నిస్తుంటారు.
ఓ సందర్భంలో భవానీ చేతికి చిక్కిన జపాన్ రాయల్ జువెల్లరీ దొంగతానికి తనకి సంబంధం లేదని తేల్చి చెప్తాడు. మరో వైపు శ్రీధర్ బంగారం దొంగతనం కేసులో జపాన్ ప్లేస్ లో మరో వ్యక్తి ను బుక్ చేసే ప్లాన్ చేస్తాడు. ఇంతకీ జపాన్ కాకుండా ఆ దొంగతనం చేసిందేవరు ? జపాన్ ఆ వ్యక్తి ని ఎలా కనుక్కున్నాడు ? పోలీస్ డిపార్ట్ మెంట్ జపాన్ ను ఏం చేశారు ? అనేది మిగతా కథ.
నటీ నటుల పనితీరు :
కార్తీ మంచి నటుడు. ఇప్పటికే ఎన్నో మంచి కేరెక్టర్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. జపాన్ లాంటి కొత్త కేరెక్టర్ దొరకడంతో ఆ పాత్రకు బెస్ట్ ఇచ్చాడు. మాట తీరు , లుక్ అన్నిటితో ఆకట్టుకున్నాడు. సినిమాకు తన నటనతో హైలైట్ గా నిలిచాడు. అను ఇమ్మనుయేల్ గ్లామర్ తో మెప్పించింది. కానీ కొన్ని సీన్స్ , ఒక సాంగ్ లో మాత్రమే కనిపించింది. సునీల్ , విజయ్ మిల్టన్ పోలీస్ పాత్రల్లో మంచి నటన కనబరిచారు. కే ఎస్ రవికుమార్ , జితన్ తదితరులు వారి పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు :
జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. టచింగ్ టచింగ్ సాంగ్ హైలైట్ గా నిలిచింది. ఎస్. రవి వర్మన్ కెమెరా విజువల్స్ బాగున్నాయి.
ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ పరవాలేదు. అన్ల్ అరసు యాక్షన్ కొరియోగ్రఫీ మాస్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి.
రాజుమురుగన్ కథ పరవాలేదు, కానీ కథనం వీక్ గా ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు బాగా రాసుకున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ వేల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.
జీ సినిమాలు సమీక్ష :
కార్తీ తన 25 వ సినిమాకు రాబరీస్ , యాక్షన్ ఎపిసోడ్స్ తో మాస్ కమర్షియల్ కథను ఎంచుకున్నాడు. దర్శకుడు రాజు మురుగన్ రాసుకున్న కథ బాగుంది కానీ ఆ స్టోరీకి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో విఫలమయ్యాడు దర్శకుడు. ముఖ్యంగా తను రాసుకున్న కథను ఆసక్తిగా తెరకెక్కించలేకపోయాడు. సినిమా మొదలైన పది నిమిషాలు 200 కోట్ల విలువగల బంగారం దొంగతనం , పోలీస్ ఇన్వెస్టిగేషన్ , బంగారం మీద ఆధార పడి జీవించే పేద కుటుంబాల సన్నివేశాలతో ఆసక్తిగా నెలకొల్పింది. కానీ జపాన్ గా హీరో ఇంట్రో నుండి కథనం ఇబ్బందిగా సాగింది.
కార్తీ మంచి నటుడు ఎలాంటి పాత్రనైనా ఈజ్ తో చేయగలడు. జపాన్ లాంటి డిఫరెంట్ కేరెక్టర్ దొరకడంతో కొత్తగా కనిపించేందుకు ప్రయత్నించాడు. ముఖ్యంగా లుక్ , డైలాగ్ డెలివరీ మార్చుకున్నాడు. కార్తీ కొత్తగా చెప్పిన డబ్బింగ్ అక్కడక్కడా నవ్వించింది. హీరోయిన్ కి సరైన కేరెక్టర్ లభించలేదు. దీంతో ఆమె మోస్తరు మార్కులతో ఓకే అనిపించుకుంది తప్ప ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. సరైన విలనిజం పండలేదు. అసలు దొంగతనం చేసింది ఎవరు అనే ఆసక్తి ఉన్నవారికి చివర్లో మెయిన్ విలన్ ఎవరో తెలిశాక పెద్దగా కిక్ అనిపించదు. సాడ్ క్లైమాక్స్ కూడా మైనస్ అనిపించింది. జపాన్ గోల్డ్ రాబరీ సీన్ పై ఇంట్రెస్ట్ కలిగించి దాన్ని సినిమా అంటూ సిల్లీగా చూపించే సన్నివేశాలు ప్రేక్షకులను నిరాశ పరుస్తాయి.
దర్శకుడు బుడదలో జల్లెడ పట్టి అందులో వచ్చే చిరు బంగారం మీద ఆధార పడిన కుటుంబాలు , వారి జీవన తీరును ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశాడు. కొన్ని సన్నివేశాలు కూడా బాగా తీశాడు. కానీ మెయిన్ కథ మీద ఇంకాస్త శ్రద్ద పెట్టి సరైన స్క్రీన్ ప్లే రాసుకొని, అదిరిపోయే ట్విస్టులు ప్లాన్ చేసుకుంటే సినిమా వేరే లెవెల్ లో ఉండేది. అవేవీ లేకపోవడంతో జపాన్ అంచనాలను అందుకోలేక సాదా సీదా సినిమా చూశామనే ఫీలింగ్ కలిగిస్తుంది.
రేటింగ్ : 2 .25 /5