Thaman

Friday,November 20,2020 - 11:56 by Z_CLU

ఘంటసాల సాయి శ్రీనివాస్ థమన్ శివ కుమార్ ప్రముఖ సంగీత దర్శకుడు, నేపధ్య గాయకుడు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ సినిమాలకు సంగీతం అందించారు. నవంబర్ 16,1983 సంవత్సరం లో ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. అలనాటి ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఘంటసాల బలరామయ్య మనవడు. థమన్ తల్లిదండ్రులు సంగీతం నేపధ్యస్థులు. చిన్నతనం నుండి సంగీత కుటుంబం లో పెరిగినందున థమన్ సంగీతం మీద ఆసక్తి పెంచుకున్నారు. మొదట శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన బాయ్స్ సినిమాలో నటుడిగా నటించిన థమన్ సంగీత దర్శకుడు మణిశర్మ, కొందరు ప్రముఖు సంగీత దర్శకుల దగ్గర పనిచేశారు. 'కిక్' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు సంగీత దర్శకుడిగా పరిచయం అయిన థమన్ 'సింధనై సెయ్' సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. 'షేర్ దిల్' సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. 'చక్రవ్యూహ' చిత్రం తో కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ చిత్రం తరువాత 'జూమ్','జాగ్వర్' వంటి కన్నడ సినిమాలకు సంగీతం అందించారు. తెలుగు లో 'కిక్', 'బృందావనం', 'మిరపకాయ్', 'రగడ', 'కందిరీగ', 'బాడీగార్డ్', 'బిజినెస్ మేన్', 'నాయక్', 'బాద్ షా', 'తడాఖా', 'బలుపు', 'రామయ్య వస్తావయ్యా', 'రేసుగుర్రం', 'రభస', 'పవర్', 'ఆగడు', 'బీరువా', 'టైగర్', 'పండగ చేస్కో', 'బ్రూస్ లీ', 'అఖిల్', 'డిక్టేటర్', 'శ్రీరస్తు శుభమస్తు' వంటి సినిమాలకు హిట్ ఆల్బమ్స్ అందించి సంగీత దర్శకుడిగా విజయాలు అందుకున్నారు.

తమన్ సంగీతం అందించిన ''అల వైకుంఠపురములో'' సినిమా అతడి కెరీర్ లో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా నిలవడమే కాకుండా.. టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సంగీత సంచలనం టాలీవుడ్ లో బిజీ మ్యూజిక్ డైరక్టర్ గా కొనసాగుతున్నాడు.

Related News