Puri Jagannadh

Tuesday,December 08,2020 - 02:49 by Z_CLU

పూరి జగన్నాధ్ సెప్టెంబర్ 28, 1966 లో జన్మించారు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు. మొదట ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన 'బద్రి' చిత్రం తో దర్శకుడిగా పరిచయమయ్యారు. మొదటి చిత్రం తో దర్శకుడిగా ఘన విజయం అందుకున్నారు. ఈ చిత్ర తరువాత జగపతి బాబు కథానాయకుడిగా 'బాచి' చిత్రాన్ని తెరకెక్కించిన పూరి జగన్నాధ్ ఆ తరువాత 'యువరాజ' చిత్రం తో కన్నడ చిత్ర పరిశ్రమ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తరువాత రవి తేజ కథానాయకుడిగా 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' చిత్రాన్ని తెరకెక్కించి విజయం అందుకున్నారు. మరో సారి రవితేజ కథానాయకుడిగా 'ఇడియట్' చిత్రాన్ని తెరకేకించి ఘన విజయం అందుకొని మరో సారి కూడా రవి తేజ తో 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' అనే చిత్రాన్ని రూపొందించి మరో హిట్ అందుకున్నారు. ఈ చిత్రం తరువత 'శివమణి','ఆంధ్రవాలా','143','సూపర్' సినిమాలను తెరక్కించిన పూరి జగన్నాధ్ మహేశ్ బాబు కథానాయకుడిగా 'పోకిరి' చిత్రం తో ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం కి గాను దర్శకుడిగా 'నంది అవార్డు' తో పాటు 'ఫిలిం ఫేర్ అవార్డు' ను అందుకున్నారు. ఈ చిత్రం తరువాత అల్లు అర్జున్ కథానాయకుడిగా 'దేశముదురు' చిత్రాన్ని రూపొందించి బాక్సాఫీస్ వద్ద మరో విజయం అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ను కథానాయకుడిగా పరిచయం చేసి 'చిరుత' చిత్రం తో మరో సూపర్ హిట్ అందుకున్న పూరి జగన్నాధ్ చిత్రం తరువాత 'బుజ్జి గాడు','ఏ నిరంజన్','నేనింతే','గోలీమార్' చిత్రాలను రూపొందించి 'బుడ్డా' అనే చిత్రం తో బాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. 'బిజినెస్ మేన్','టెంపర్' , 'ismart shankar' చిత్రాలతో విజయాలు అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరి గా కొనసాగుతున్నారు.

Born : 28th September 1966

Related News