Koratala Siva

Thursday,November 26,2020 - 11:45 by Z_CLU

కొరటాల శివ  ప్రముఖ దర్శకుడు జూన్ 15 , 1975 లో జన్మించారు..  ప్రముఖ రచయిత, నటుడు  పోసాని కృష్ణ మురళి దగ్గర కొన్నాళ్ళు స్క్రీన్ రైటింగ్ అసిస్టెంట్ గా పనిచేశారు. 'గర్ల్ ఫ్రెండ్' చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమలో రచయిత గా కెరీర్ ను ప్రారంభించారు. ఆ తరువాత 'భద్ర', 'మున్నా', 'ఒక్కడున్నాడు', 'సింహ', 'బృందావనం', 'ఊసరవెల్లి' సినిమాలకు రచయితగా పనిచేశారు.

'ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిన 'మిర్చి' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తో దర్శకుడిగా తొలి విజయం అందుకున్న కొరటాల శివ  ఈ చిత్రం తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న మహేష్ కథానాయకుడిగా 'శ్రీమంతుడు' సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధించి తెలుగు  చిత్ర పరిశ్రమ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

'శ్రీమంతుడు' తరువాత ఎన్టీఆర్ కథానాయకుడిగా 'జనతా గ్యారేజ్' సినిమాను తెరకెక్కించి దర్శకుడిగా మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తర్వాత మరోసారి మహేష్ కథానాయకుడిగా భరత్ అనే నేను సినిమా తీసి ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టారు.

ప్రస్తుతం చిరంజీవి హీరోగా ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ.

Related News