వివేక్ ఆత్రేయ

Friday,November 13,2020 - 12:06 by Z_CLU

టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో ఒకడు వివేక్ ఆత్రేయ. మొదటి సినిమా మెంటల్ మదిలో. శ్రీవిష్ణు హీరోగా తీసిన ఆ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు వివేక్ ఆత్రేయ. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు.

ఇక రెండో ప్రయత్నంగా మళ్లీ శ్రీవిష్ణు-నివేత థామస్ తో బ్రోచేవారెవరురా అనే సినిమా తీశాడు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సత్యదేవ్, నివేత పెతురాజ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది.

ఈ సినిమా సక్సెస్ తో తన మూడో సినిమాకు ఏకంగా నానిని డైరక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు వివేక్ ఆత్రేయ. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు ఈ దర్శకుడు.