విక్రమ్

Thursday,November 17,2016 - 02:52 by Z_CLU

విక్రమ్ ఏప్రిల్ 17 , 1966 లో జన్మించారు. విక్రమ్ అసలు పేరు కెన్నెడీ విక్టర్ జాన్. ‘ఎన్ కాదల్ కన్మణి’ చిత్రం తో 1990 లో తమిళ చిత్ర పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తరువాత తమిళ్, మలయాళం చిత్రాల్లో నటించిన విక్రమ్  బాల దర్శకత్వం లో 1999  లో తెరకెక్కిన  ‘సేతు’ చిత్రంతో  ఘన విజయం అందుకున్నారు. ఆ తరువాత ‘దిల్’,’జెమినీ’,’ధూల్’,’సామి’ చిత్రాలతో విజయాలు అందుకున్నారు. ‘కాసి’ చిత్రం లో గుడ్డి వాడి గా నటించి విశ్లేషకులను సైతం తన నటనతో ఆకట్టుకున్నాడు. ‘పీత మగన్’ చిత్రం తో నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ యాక్టర్ కేటగిరి లో నేషనల్ అవార్డు అందుకున్నారు. శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘అన్నియన్’ చిత్రం లో విభిన్న పాత్ర తో విశ్లేషకులను సైతం ఆకట్టుకొని మరో ఘన విజయం అందుకున్నారు. ఈ చిత్రం తరువాత పలు విభిన్న చిత్రాలతో కథానాయకుడిగా పలు విజయాలు అందుకున్న విక్రమ్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘ఐ’ చిత్రం లో నటన తో విశ్లేషకులను సైతం ఆకట్టుకొని కథానాయకుడిగా మరో గొప్ప గుర్తింపు అందుకున్నారు.. విక్రమ్ కథానాయకుడిగా 7  ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు నేషనల్ వార్డు, తమిళ్ నాడు స్టేట్ అవార్డు ను అందుకున్నారు.

సంబంధిత వార్తలు