విజయ్ ఆంటోని

Thursday,November 17,2016 - 12:40 by Z_CLU

విజయ్ అంటోనీ జులై 24 , 1975 లో తమిళ్ నాడులో జన్మించారు. ‘శుక్రన్’ చిత్రం తో తమిళ చిత్ర పరిశ్రమకు సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్న విజయ్ ఆంటోనీ పలు తమిళ చిత్రాలకు సంగీతం అందించారు. ‘నాకు ముక్క’,’అతి చుడి’ పాటలతో సంగీత దర్శకుడిగా గొప్ప గుర్తింపు అందుకున్నారు. కొన్ని సినిమాలలో పాటలు కూడా పాడారు.తెలుగు లో ‘మహాత్మ’ చిత్రానికి సంగీతం అందించారు. 2002 లో ‘నాన్’ చిత్రం తో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం ‘నకిలి’ పేరుతో తెలుగులో విడుదల అయింది. ఆ తరువాత నటుడిగా పలు చిత్రాలు చేసిన విజయ్ ఆంటోనీ ‘సలీం’ తో మరో విజయం అందుకున్నారు. ఈ చిత్రం తెలుగు లోనూ మంచి విజయం సాధించింది. ‘పిచై క్కారన్’ చిత్రం తో ఘన విజయం అందుకున్నారు. ఈ చిత్రం తెలుగు ‘బిచ్చగాడు’ గా విడుదలై ఘన విజయం అందుకొని మంచి కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ ‘సైతాన్’,’యెమన్’ అనే చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నారు. ‘సైతాన్’ తెలుగు ‘భేతాళుడు’ టైటిల్ తో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు