వరుణ్ తేజ్

Thursday,December 17,2020 - 01:31 by Z_CLU

వరుణ్ తేజ్ ప్రముఖ కథానాయకుడు. జనవరి 19 , 1989 లో జన్మించారు. 2000 లో శివ నాగేశ్వరావు దర్శకత్వం లో తెరకెక్కిన ‘హాండ్స్ అప్’ సినిమాతో బాల నటుడిగా పరిచయం అయిన వరుణ్ తేజ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా తెరకెక్కిన ‘ముకుంద’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయం అయ్యారు.

ఈ చిత్రం తరువాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కిన ‘కంచె’ సినిమాలో కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం బెస్ట్ తెలుగు ఫీచర్ ఫిలిం కేటగిరి లో నేషనల్ అవార్డు అందుకుంది. ఈ సినిమా తరువాత పూరి జగన్నాధ్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘లోఫర్’, శ్రీను వైట్ల దర్శకత్వం లో ‘మిస్టర్’ సినిమాలోకథానాయకుడిగా నటించాడు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా, వెంకీ అట్లూరి తీసిన తొలిప్రేమ సినిమాలతో స్టార్ స్టేటస్ అందుకున్నాడు వరుణ్ తేజ్. ఆ తర్వాత వెంకటేష్ తో కలిసి చేసిన ఎఫ్2 సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం, గద్దలకొండ గణేశ్ సూపర్ హిట్ అవ్వడంతో వరుణ్ తేజ్ మార్కెట్ పెరిగింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీగా ఉన్నాడు ఈ మెగా హీరో.

Born : 19 January 1990
Zodiac : Capricorn
Height : 6.3 Feet

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు