వంశీ

Friday,June 02,2017 - 04:20 by Z_CLU

వంశీ ప్రముఖ దర్శకుడు. 1982 లో తెరకెక్కిన ‘మంచు పల్లకి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘సితార’,’అన్వేషణ’,’ప్రేమించు పెళ్లాడు’,’ఆలాపన’,’లేడీస్ టైలర్’, ‘ఏప్రిల్ 1 విడుదల’,’డిటెక్టీవ్ నారద’,’జోకర్’,’అవును వాళ్లిద్దరూ ఇష్ట పడ్డారు’,’గోపి గోపిక గోదావరి’,’సరదాగా కాసేపు’,’ఫ్యాషన్ డిజైనర్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. వంశీ దర్శకుడిగా తన మార్క్ కామెడీ తో కామెడీ చిత్రాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు..