వక్కంతం వంశీ

Thursday,November 24,2016 - 06:42 by Z_CLU

వక్కంతం వంశీ ప్రముఖ రచయిత. అరికెల్ల గ్రామం చిత్తూర్ (జిల్లా) లో జన్మించారు. మొదట టెలివిజన్ లో బాపు సీరియల్ లో పనిచేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ‘కలుసుకోవాలని’ సినిమాతో రచయితగా పరిచయం అయ్యారు. ఈ సినిమా తరువాత జూనియర్ ఎన్.టి.ఆర్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘అశోక్’, మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన ‘అతిధి’ సినిమాలకు రచయితగా పనిచేసిన వక్కంతం రవి తేజ నటించిన ‘కిక్’ సినిమా తో రచయితగా గుర్తింపు అందుకున్నారు. ఆ తరువాత కళ్యాణ్ రామ్ ‘కత్తి’ ,’ఊసరవెల్లి’,’ఎవడు’,’రేసు గుర్రం’,’కిక్ 2′ వంటి సినిమాకు రచయితగా పనిచేశారు. ఎన్.టి.ఆర్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘టెంపర్’ సినిమాకు కథను అందించారు.

సంబంధిత వార్తలు