వీవీ వినాయక్

Friday,November 27,2020 - 01:41 by Z_CLU

గండ్రోతు వీర వెంకట వినాయక్ ప్రముఖ దర్శకుడు. అక్టోబర్ 9 , 1974 లో జన్మించారు. వినాయక్ ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఆది’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తో దర్శకుడిగా ఘన విజయం అందుకున్న వినాయక్ బెస్ట్ ఫస్ట్ ఫిలిం అఫ్ డైరెక్టర్ కేటగిరిలో నంది అవార్డు ను పొందారు.

ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ కథానాయకుడిగా ‘చెన్నకేశవ రెడ్డి’ చిత్రాన్ని తెరకెక్కించి మరో విజయం అందుకున్నారు. తర్వాత ‘దిల్’ చిత్రంతో మరో విజయం అందుకున్న వినాయక్ చిరంజీవి కథానాయకుడిగా రూపొందించిన ‘ఠాగూర్’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఈ చిత్రం తర్వాత ‘సాంబ’, ‘బన్నీ’, ‘లక్ష్మి’, ‘యోగి’, ‘కృష్ణ’, ‘అదుర్స్’, ‘బద్రినాధ్’, ‘నాయక్’, ‘అల్లుడు శీను’, ‘అఖిల్’ చిత్రాలతో దర్శకుడిగా పలు విజయాలు అందుకున్నారు.

చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ కి దర్శకుడు ఇతడే. ఆ తర్వాత సాయితేజ్ హీరోగా ఇంటెలిజెంట్ అనే సినిమాను తెరకెక్కించాడు.

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డైరక్టర్స్ లో ఒకడిగా కొనసాగుతున్నారు వినాయక్.

Born : October 9, 1974

సంబంధిత వార్తలు

సంబంధించిన చిత్రం