తమన్న భాటియ

Thursday,December 17,2020 - 01:34 by Z_CLU

తమన్న భాటియా డిసెంబర్ 21, 1989 లో జన్మించారు. 2005 ‘చాంద్ స రోషన్ చెహ్రా’ చిత్రం తో బాలీవుడ్ లో కథానాయికగా పరిచయం అయ్యారు. ‘శ్రీ’ చిత్రం తో తెలుగు చిత్రపరిశ్రమకు కథానాయికగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తరువాత ‘హ్యాపీ డేస్’ చిత్రం లో నటించింది. ఈ చిత్రం తో విజయం అందుకొని కథానాయికగా టాలీవుడ్ లో గుర్తింపు అందుకున్నారు తమన్న.

ఈ చిత్రం తరువాత తెలుగు, తమిళ్ భాషలో కథానాయికగా బిజీ అయ్యారు. తెలుగు లో ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘100% లవ్’, ‘బద్రినాధ్’, ‘ఊసరవెల్లి’, ‘రచ్చ’, ‘ఎందుకంటే ప్రేమంట’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’, ‘తడాఖా’, ‘ఆగడు’, ‘బాహుబలి’, ‘ఊపిరి’ చిత్రాలతో తమన్న గుర్తింపు అందుకున్నారు.

బాహుబలి, బాహుబలి-2, ఎఫ్2 సినిమాలు తమన్నకు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. ప్రస్తుతం సినిమాలు, ఓటీటీ కంటెంట్ తో తమన్న బిజీగా ఉంది.

Born : 21 december 1989
Zodiac : Sagittarius
Height : 5.5 feet

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు