సూర్య

Thursday,November 24,2016 - 03:58 by Z_CLU

సూర్య శివ కుమార్ జులై 23 ,1975 లో కోయంబతూర్ తమిళ్ నాడు లో జన్మించారు. ప్రముఖ నటుడు. ‘నేరుక్కు నెర్’ చిత్రం తో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ చిత్రం లో కథానాయకుడు విజయ్ తో కలిసి మరో కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం తరువాత ‘కాదల్ నిమ్మది’,’సంధిప్పొమ్మ’,’పెరియన్న’పూవెళ్ళాం కేట్టుప్పర్’,’ఉయిరీలే కాలన్తతు’ ,’ఫ్రెండ్స్’ వంటి చిత్రాల్లో నటించారు. ‘నంద’ చిత్రం తో కథానాయకుడిగా మంచి గుర్తింపు అందుకున్నారు. ఈ చిత్రం తరువాత పలు తమిళ చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన సూర్య ‘పితా మగన్’,’పేరాజగన్’,’పెరియ అన్న’,’గజిని’,’ఆరు’,’ఆధవాన్’,’వారణం ఆయిరం’,’అయన్ ‘,’సింగం’,’మాట్రన్’,’7 ఆమ్ అరివు’,’24 ‘ వంటి చిత్రాలతో కథానాయకుడిగా మంచి గుర్తింపు తో పాటు తన నటన తో విశ్లేషకులను సైతం ఆకట్టుకొని పలు విజయాలు అందుకున్నారు. సూర్య నటించిన పలు సినిమాలు తెలుగులోనూ డబ్బింగ్ సినిమాలుగా విడుదలై మంచి విజయం అందుకున్నాయి. ఈ సినిమాలతో తెలుగు లోనూ కథానాయకుడిగా మంచిగుర్తింపు అందుకున్నారు. కథానాయకుడిగా సూర్య మూడు తమిళనాడు స్టేట్ ఫీల్ అవార్డులను, మూడు ఫీల్ ఫేర్ అవార్డులను అందుకున్నారు.

సంబంధిత వార్తలు

సంబంధించిన చిత్రం