సుందర్ సి

Thursday,November 14,2019 - 12:35 by Z_CLU

సుందర్.సీ తమిళ చలనచిత్ర దర్శకులు మరియు నటుడు. తమిళనాడులోని ఈరోడు జిల్లాలో జన్మించారు, తమిళంలో 25 సినిమాలకు పైగా  దర్శకత్వం వహించారు. “తలై నగరం” చిత్రముతో హీరోగా మారారు. తొలి నాళ్ళలో, మణివణ్ణన్ గారి దగ్గర సహాయకులుగా ఉన్న వీరు ముఱై మామన్ అనే హాస్యరసప్రధాన చిత్రముతో మొదటిసారి దర్శకులురా మారారు.

1995-వ సంవత్సరం ముఱై మామన్ అనే హాస్యరసప్రధాన చిత్రముతో సుందర్.సీ మొదటిసారి దర్శకులురా మారారు, ఆ తర్వాత ముఱైమాప్పిళ్ళై, అని నటుడు విజయ్ కుమార్ తనయుడు అరుణ్ విజయ్ మొదటి సినిమాకు దర్శకత్వం వహించారు. రజినీ కాంత్ గారితో అరుణాచలం, కమల్ హాసన్ తో శివం మాత్రమే కాక మరికొందరి నటులతో అనగా కార్తీక్, ప్రశాంత్, అర్జున్, శరత్ కుమార్ మరియు అజీత్ కుమార్ మొదలైనవారి చిత్రములకు దర్శకత్వం వహించారు.ఇయన తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన చిత్రం ‘సమ్ థింగ్ సమ్ థింగ్’ .

సంబంధించిన చిత్రం