సుకుమార్

Wednesday,December 16,2020 - 02:43 by Z_CLU

సుకుమార్ ప్రముఖ దర్శకుడు. జనవరి 11, 1970 రాజోలు (ఆంధ్ర ప్రదేశ్) లో జన్మించారు. తొలుత ఓ ప్రయివేట్ కళాశాల లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తరువాత దర్శకులు మోహన్ , వి.వి.వినాయక్ దగ్గర రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. 2004 లో అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఆర్య’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం ఘన విజయం అందుకుంది.

ఈ సినిమాతో దర్శకుడిగా సుకుమార్ మంచి గుర్తింపు తో పాటు బెస్ట్ డైరెక్టర్ ఫిలిం ఫేర్ అవార్డు, నంది బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డు ను అందుకున్నారు. ఈ సినిమా తరువాత ‘జగడం’ , ‘ఆర్య 2’, ‘100 % లవ్’ వంటి సినిమాలను తెరకెక్కించారు. మహేష్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో దర్శకుడిగా మరింత గుర్తింపు అందుకున్నారు. ఎన్.టి.ఆర్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమ’ తో సినిమాను తెరకెక్కించి ఘన విజయం అందుకున్నారు. సుకుమార్  కె.వి.రెడ్డి మెమోరియల్ పురస్కారం అందుకున్నారు. సుకుమార్ డైరక్ట్ చేసిన రంగస్థలం సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ప్రస్తుతం ఈ దర్శకుడు బన్నీ హీరోగా పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు.

Born : 11 January 1970

సంబంధిత వార్తలు