శృతిహాసన్

Wednesday,December 16,2020 - 02:27 by Z_CLU

శృతిహాసన్ జనవరి 28,1986 లో చెన్నై(తమిళనాడు) లో జన్మించారు. శృతి హాసన్ ప్రముఖ విలక్షణ నటుడు కమల్ హాసన్ కుమార్తె. 2009 లో హిందీ చిత్రం ‘లక్’ తో కథానాయికగా పరిచయం అయ్యారు. ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమ కు కథానాయికగా పరిచయం అయ్యారు.

ఈ చిత్రం తరువాత ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రం లో నటించిన శృతి హాసన్ 2011 లో ‘7 ఆమ్ అరివు’ చిత్రం తో తమిళ్ చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తరువాత 2012 లో శృతి హాసన్ నటించిన ‘గబ్బర్ సింగ్’ ఘన విజయం సాధించి శృతికు స్టార్ ఇమేజ్ అందించింది.

ఈ చిత్రం తరువాత ‘బలుపు’, ‘ఎవడు’, ‘పులి’, ‘రేసుగుర్రం’ చిత్రాల్లో నటించిన శ్రుతి హాసన్ ‘శ్రీమంతుడు’ తో మరో ఘన విజయం అందుకున్నారు. సంగీతం మీద ఆసక్తి తో పలు చిత్రాల్లో నేపధ్య గాయని గా పాటలు పాడారు.

ప్రస్తుతం తెలుగు-తమిళ-హిందీ భాషల్లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది శృతిహాసన్.

Born : 28 January 1986

సంబంధిత వార్తలు