సమంత

Monday,November 30,2020 - 12:44 by Z_CLU

సమంత ప్రముఖ కథానాయిక. తమిళ్, తెలుగు భాషల్లో నటించారు. ఏప్రిల్ 28 న 1987 లో జన్మించారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం లో నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఏమాయ చేసావే’ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు కథానాయికగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తో కథానాయికగా మంచి గుర్తింపు తో పాటు ఫిలిం ఫేర్ అవార్డు, నంది స్పెషల్ జూరీ అవార్డు తో పాటు పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత తెలుగులో ‘బృందావనం’, ‘దూకుడు’, ‘ఈగ’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’, ‘మనం’ సినిమాలతో వరుస విజయాలు అందుకొని అతితక్కువ సమయంలోనే టాలీవుడ్ టాప్ కథానాయికగా ఎదిగారు.

‘విన్నై తాండి వరువాయా’ సినిమాలో అతిధి పాత్ర తో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తరువాత ‘బాణ కాథడి’, మాస్కోవిన్ కావేరి’, ‘నాన్ ఈ’, ‘అంజాన్’, నాడు నిసి నాయగల్’, ‘కత్తి’, ’10 ఎండ్రత్తుకుల్లా’, ‘తంగ మగన్’, ‘తేరి’, ’24 ‘ వంటి సినిమాలతో కథానాయికగా గుర్తింపుతో పాటు పలు విజయాలు అందుకున్నారు.

సమంత కథానాయికగా మూడు ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. జనతా గ్యారేజీ, రంగస్థలం, ‘అ..ఆ’ సినిమాలతో ఘన విజయాలు అందుకున్న సమంత.. ప్రస్తుతం తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు మాత్రమే చేస్తోంది. ఆమె నటించిన ఓ బేబీ సూపర్ హిట్టయింది. జాను తర్వాత సమంత గ్యాప్ తీసుకుంది.

Born : April 28, 1987
Zodiac : Taurus
Height : 1.68m

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు