సలోని

Thursday,December 15,2016 - 12:06 by Z_CLU

సలోని అశ్వని ప్రముఖకథానాయిక.  జూన్1, 1987 లో జన్మించారు మొదట మోడల్ గా కొనసాగిన సలోని ‘దిల్ పరదేశి హోగయా’ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం అయ్యారు. సుమంత్ హీరోగా తెరకెక్కిన ‘ధన51’సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తరువాత ‘ఒక ఊరిలో’,’చుక్కల్లో చంద్రుడు’,’కోకిల’ వంటి పలు తెలుగు సినిమాల్లో నటించారు. రాజమౌళి దర్శకత్వం లో సునీల్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘మర్యాద రామన్న’ సినిమాతో ఘన విజయం అందుకున్నారు. ఆ తర్వాత ‘తెలుగమ్మాయి’,’అధినాయకుడు’,’రేసు గుర్రం’ వంటి సినిమాలలో నటించడం తో పాటు పలు కన్నడ సినిమాల్లో కథానాయికగా నటించారు. తెలుగు లో ‘మగధీర’ సినిమాలో గెస్ట్ అపిరియన్స్ చేశారు. తాజాగా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సినిమాలో పృద్వి సరసన కథానాయికగా నటించారు.