సాయి రామ్ శంకర్

Wednesday,March 15,2017 - 03:38 by Z_CLU

రామ్ శంకర్ ప్రముఖ కథానాయకుడు. ప్రముఖ తెలుగు చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు..మొదట పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన బద్రి , బాచి , ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం , ఇడియట్ , అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి అండ్ శివమణి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. రవి తేజ కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఇడియట్’ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో రవితేజ కి స్నేహితుడిగా నటించిన సాయి రామ్ శంకర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రూపొందిన ‘143’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాతో కథానాయకుడిగా గుర్తింపు అందుకున్న సాయి రామ్ శంకర్ ఆ తర్వాత ‘డేంజర్’, ‘హలో ప్రేమిస్తారా’,’బంపర్ అఫర్’ ,’వాడే కావాలి’,’యమహా యమా’,’వెయ్యి అబద్దాలు’,’దిల్లున్నోడు’,’రోమియో’,’అరకు రోడ్ లో’ నేనోరకం’ సినిమాలలో కథానాయకుడిగా నటించారు…

సంబంధించిన చిత్రం