రితికా సింగ్

Tuesday,April 11,2017 - 02:43 by Z_CLU

తమిళ్ లో తెరకెక్కిన ఇరుది సుత్రు అనే సినిమాతో రితికా సింగ్ పాపులర్ అయ్యారు. ఇదే సినిమాను హిందీలో సాలా ఖడూస్ గాా, తెలుగులో గురు సినిమాగాా తెరెకెక్కించారు. వెంకీ సరసన గురులో కూడా నటించిన రితికా టాలీవుడ్ లో పాపులర్ అయ్యారు. అదే ఊపులో తమిళ్ లో లారెన్స్ సరసన శివలింగ అనే సినిమా చేేశారు.

సినిమాల్లోకి రాకముందు స్వతహాగా క్రీడాకారిణి. 2009 ఏషియన్ ఇండోర్ గేమ్స్ లో సూపర్ ఫైట్ లీగ్ లో పాల్గొంది రితికా సింగ్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉండడంతో పాటు.. స్పోర్ట్స్ బేస్డ్ కథ కావడంతో దర్శకురాలు సుధా కొంగర.. రితికాకు అవకాశం ఇచ్చారు. అలా తెలుగు, తమిళ్, హిందీ  భాషల్లో రితికా పాపులర్ అయ్యారు. ఇరుదు సిత్రు సినిమాలో నటనకు గాాను 63వ జాతీయ ఫిలిం అవార్డుల్లో రితికా సింగ్ కు స్పెషల్ మెన్షన్ అవార్డు కూడా దక్కింది.

Born : 16 December 1994