రవితేజ

Thursday,November 12,2020 - 10:34 by Z_CLU

రవి శంకర్ రాజు భూపతిరాజు. వెండి తెరపై రవితేజగా గుర్తింపు అందుకున్నారు. జనవరి 26, 1968 లో జగ్గంపేట (ఆంధ్రప్రదేశ్) లో జన్మించారు. మొదట చెన్నై లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి పలు టెలివిజన్ , సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశారు.
ఆ తరువాత కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాకుఅసిస్టెంట్ గాపనిచేశారు.తరువాత ‘కర్తవ్యం’,’చైతన్య’,’ఆజ్ కా గుండారాజ్’ ,’అల్లరి ప్రియుడు’,’నిన్నే పెళ్లాడతా’,’అన్నయ్య’ వంటి పలు సినిమాలలో సపోర్టింగ్ పాత్రలు చేశారు. కృష్ణ వంశీ దర్శకత్వం లో తెరకెక్కిన ‘సింధూరం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమా తరువాత ‘నీకోసం’ సినిమాలో హీరోగా నటించిన రవి తేజ ఈ సినిమాకు గాను నంది స్పెషల్ జూరీ అవార్డు అందుకున్నారు. ఆ తరువాత హీరోగా ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’,’అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’,’ఇడియట్’ వంటి సినిమాలతో విజయాలు అందుకున్నారు.’ఖడ్గం’ సినిమాలో కోటి పాత్ర కు గానూ రవి తేజ మరో నంది స్పెషల్ జ్యూరీ అవార్డు సొంతం చేసుకున్నారు. రవితేజ ‘అమ్మానాన్న ఓ తమిళమ్మాయి’, ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’, ‘వెంకీ’, ‘నా ఆటో గ్రాఫ్’, ‘భద్ర’, ‘విక్రమార్కుడు’, ‘దుబాయ్ శీను’, ‘కృష్ణ’, ‘నేనింతే’, ‘కిక్’, ‘శంభోశివశంభో’, ‘డాన్ శీను’, ‘మిరపకాయ్’, ‘బలుపు’, ‘పవర్’, ‘బెంగాల్ టైగర్’ వంటి సినిమాలతో కథానాయకుడిగా పలు విజయాలు అందుకున్నారు. రవితేజ ఇప్పటివరకూ దాదాపు 60 సినిమాలకు పైగా నటించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు మాస్ రాజా.

Born : 26 January 1968
Zodiac : Leo
Height : 6.0 Feet

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు