రానా దగ్గుబాటి

Monday,November 09,2020 - 10:29 by Z_CLU

దగ్గుబాటి రానా ప్రముఖ నటుడు. డిసెంబర్ 14 , 1984 లో జన్మించారు. రానా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడు. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దగ్గుబాటి సురేష్ తనయుడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన ‘లీడర్’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. రానా తొలి చిత్రం తోనే కథానాయకుడిగా మంచి గుర్తింపు అందుకున్నారు. ఈ చిత్రం తరువాత బాలీవుడ్ లో ‘దమ్ మారో దమ్’ చిత్రం తో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. తెలుగు లో ‘నేను నా రాక్షసి’, ‘నా ఇష్టం’ చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన రానా క్రిష్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాతో విశ్లేషకులను సైతం ఆకట్టుకొని నటుడిగా మంచి మార్కులు అందుకున్నారు. హిందీ లో ‘ఎహ్ జవానీ హై దివాని’ ,’బేబీ’ వంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు. ‘ఆరంభం’ చిత్రంలో అతిధి పాత్ర తో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ‘బాహుబలి’, బాహుబలి-2 చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకున్నారు. తెలుగు చారిత్రాత్మక చిత్రం ‘రుద్రమదేవి’ లో చాళుక్య వీరభద్ర పాత్రలో నటించారు. ‘ఘాజి’, లాంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించారు. ప్రస్తుతం విలక్షణ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

Born : December 14, 1984

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు