రామ్ పోతినేని

Tuesday,December 08,2020 - 04:12 by Z_CLU

రామ్ పోతినేని టాలీవుడ్ నటుడు. మే 15 న 1988లో జన్మించారు. ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ రామ్ కు పెదనాన్న. 2006 లో ‘దేవదాసు’ చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమ లో కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రం 175 రోజులు ప్రదర్శించబడి ఘన విజయం అందుకుంది. ఈ చిత్రం తరువాత రామ్ సుకుమార్ దర్శకత్వం లో ‘జగడం’ సినిమాలో కథానాయకుడిగా నటించారు. మూడో చిత్రం ‘రెఢీ’ తో కథానాయకుడిగా మరో విజయం అందుకున్నాడు.  తరువాత ‘మస్కా’, ‘గణేష్’,’రామ రామ కృష్ణ కృష్ణ’, సినిమాలలో కథానాయకుడిగా నటించారు.

ఈ చిత్రాల తరువాత ‘కందిరీగ’ చిత్రంతో మరో విజయం అందుకున్న రామ్ ‘ఎందుకంటే ప్రేమంట’,’ఒంగోలు గిత్త’, ‘మసాలా’,’పండగ చేస్కో’, ‘శివమ్’ వంటి వరుస సినిమాలలో కథానాయకుడిగా నటించారు.’నేను శైలజ’ తో మంచి కలెక్షన్స్ సాధించి కెరీర్ లో మరో ఘన విజయం అందుకున్నాడు. ఆ తర్వాత ‘హైపర్’ సినిమా చేశాడు. ఇక కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా పూరి జగన్నాద్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేశాడు. ప్రస్తుతం రామ్ చేతిలో రెడ్ సినిమా ఉంది.

Born : Hyderabad, Telangana

సంబంధిత వార్తలు