రామ్ చరణ్

Wednesday,November 11,2020 - 06:34 by Z_CLU

రామ్ చరణ్  మార్చ్ 27 1985 లో చెన్నైలో జన్మించారు. రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడు. ‘చిరుత’  సినిమాతో కథానాయకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం లో తెరకెక్కిన మొదటి చిత్రం తో హీరో గా మంచి మార్కులు సంపాదించుకున్న  రామ్ చరణ్ ఈ సినిమాకు గాను నంది అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. రెండో చిత్రం ‘మగధీర’ తో కథానాయకుడిగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.  రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో మొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో 50 కోట్లు వసూళ్లు సాధించి 50 కోట్ల క్లబ్ లో చేరారు రామ్ చరణ్. ఈ సినిమాకు గాను మరో సారి  ఆ తరువాత  బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో ‘ఆరెంజ్’ సినిమాలో నటించిన రామ్ చరణ్ ‘రచ్చ’ సినిమాతో  మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రం తరువాత ‘ఎవడు’ తో మరో సారి సూపర్ హిట్ అందుకున్నారు. కృష్ణ వంశీ దర్శకత్వం లో ‘గోవిందుడు అందరి వాడేలే’ శ్రీను వైట్ల దర్శకత్వం లో ‘బ్రుస్ లీ’ సురేందర్ రెడ్డి దర్శకత్వం లో ‘ధృవ’ సినిమాల్లో నటించారు. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ చేసిన రంగస్థలం సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.

Born : 27 March 1985

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు