రకుల్ ప్రీత్ సింగ్

Friday,November 20,2020 - 06:10 by Z_CLU

రకుల్ ప్రీత్ సింగ్ అక్టోబర్ 10 , 1990 లో జన్మించారు. ‘గిల్లి’ చిత్రం తో కన్నడ చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం అయ్యారు. ‘కెరటం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ‘తడైయారా తాక్కా’ చిత్రం తో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ‘యారియాన్’ చిత్రం తో బాలీవుడ్ లో కథానాయికగా పరిచయం అయ్యారు. ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రం తెలుగు లో కథానాయికగా గుర్తింపు తో పాటు విజయం అందుకున్నారు. ఈ చిత్రం తారువాత తమిళ్ లో ‘ఎన్నం ఏదో’ అనే చిత్రం లో నటించారు. తెలుగు లో ‘లౌక్యం’,’కరెంట్ తీగ’,’పండగ చేస్కో’,’కిక్-2 ‘,’బ్రూస్ లీ’ చిత్రాలలో కథానాయికగా నటించారు. ‘నాన్నకు ప్రేమ తో’,’సరైనోడు’,’ధృవ’,’రారండోయ్ వేడుక చూద్దాం’,’జయ జానకి నాయక’ చిత్రాలతో వరుస విజయాలు అందుకొని ప్రస్తుతం వరుస  చిత్రాలలో నటిస్తూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్నారు.

Born : 10 october 1990
Zodiac : libra
Height : 5.6 feet

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు