రజిని కాంత్

Monday,December 14,2020 - 12:20 by Z_CLU

శివాజీ రావు గైక్వాడ్ డిసెంబర్ 12, 1950 లో జన్మించారు. స్క్రీన్ పేరు రజిని కాంత్ గా మార్చుకున్నారు. బాల చందర్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘అపూర్వ రాగంగాళ్’ చిత్రం తో నటుడిగా తమిళ చిత్ర పరిశ్రమ లో అరంగేట్రం చేశారు. ‘కథ సంగమ’ అనే చిత్రం తో కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయమైన రజిని కాంత్ ఆ తరువాత ‘అంతులేని కథ’ చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమ కు నటుడిగా పరిచయం అయ్యారు. తొలుత కొన్ని సినిమాల్లో ప్రాధాన్య పాత్రలు చేసిన రజిని కాంత్ ఆ తరువాత కథానాయకుడిగా వరుస తమిళ చిత్రాలతో అతి తక్కువ కాలం లోనే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొని సూపర్ స్టార్ గా ఎదిగారు.
రజిని కాంత్ ఇప్పటి వరకూ బెస్ట్ యాక్టర్, స్పెషల్ బెస్ట్ యాక్టర్ కేటగిరి లో 6 తమిళ్ స్టేట్ అవార్డులను, బెస్ట్ తమిళ్ యాక్టర్ కెటగిరి లో ఫిలిం ఫేర్ అవార్డు ను అందుకున్నారు. 2000 సంవత్సరం లో రజిని ను పద్మభూషణ్ అవార్డు తో సన్మానించిన గవర్నమెంట్ అఫ్ ఇండియా 2016 లో పద్మ విభూషణ్ అవార్డు తో సన్మానించారు. ప్రస్తుతం రజిని కాంత్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Born : born 12 December 1950

సంబంధిత వార్తలు