రాజ్ తరుణ్

Thursday,November 17,2016 - 01:18 by Z_CLU

రాజ్ తరుణ్ మే 11 , 1992 వైజాగ్ లో జన్మించారు. తొలుత లఘు చిత్రాలలో నటించిన రాజ్ తరుణ్ విరించి వర్మ దర్శకత్వం లో తెరకెక్కిన ‘ఉయ్యల జంపాల’ చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. నాగార్జున, రాంమోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం తో కథానాయకుడిగా తొలి చిత్రంతోనే గుర్తింపు అందుకున్నారు. ఈ చిత్రం తరువాత ‘సినిమా చూపిస్త మావ’ సినిమాలో కథానాయికగా నటించిన రాజ్ తరుణ్ మరో విజయం అందుకున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాణం లో తెరకెక్కిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో కథానాయకుడిగా ఘన విజయం అందుకోవడం తో పాటు వరుసగా మూడు విజయాలు సొంతం చేసుకున్నారు.. ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’,’ఈడో రకం ఆడో రకం’ చిత్రాల్లో నటించారు. నాని నటించిన ‘మజ్ను’ చిత్రం లో అతిధి పాత్ర చేశారు.
ప్రస్తుతం ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’,’అందగాడు’,’రాజు గాడు యమా డేంజర్’ అనే చిత్రాలలో కథానాయకుడిగా నటిస్తున్నాడు.

Born : May 11, 1992

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు