ప్రియమణి

Thursday,November 17,2016 - 04:20 by Z_CLU

ప్రియమణి జూన్ 4 , 1982 లో కర్ణాటక లోని బెంగుళూర్ సిటీ లో జన్మించారు. ప్రియమణి ‘ఉల్లం’ చిత్రం తో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ చిత్రం తరువాత ‘ఎవరి అతగాడు’ చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం అయ్యారు.
తరువాత ‘కంగలాల్ ఖైదు సెయ్’ చిత్రం లో నటించారు. ‘సత్యం’ చిత్రం తో మలయాళ చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తరువాత తమిళ్, మలయాళం లో సినిమాలు చేసిన ప్రియమణి కార్తీ కథానాయకుడిగా తెరకెక్కిన ‘పరుత్తి వీరన్’ చిత్రం తో కథానాయికగా గొప్ప గుర్తింపు అందుకోవడం తో పాటు నేషనల్ అవార్డు తమిళ స్టేట్ ఫిలిం అవార్డు తో పాటు ఫిలిం ఫేర్ అవార్డు ను కూడా అందుకున్నారు. ప్రియమణి తెలుగు లో ‘పెళ్ళైన కొత్తలో’,’టాస్’ చిత్రాలలో నటించారు. ఎన్.టి.ఆర్ కథానాయకుడిగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం తో కథానాయికగా తెలుగు లో ఘన విజయం అందుకున్నారు. ఈ చిత్రం తరువాత ‘నవ వసంతం’,’హరే రామ్’,’ద్రోణ’,’మిత్రుడు’,’ప్రవరాఖ్యుడు’ ,’సాధ్యం’,’గోలీమార్’,’రగడ,’రాజ్’,’క్షేత్రం’ వంటి చిత్రాలలో నటించారు.’చారులత’ చిత్రం తో బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరి లో కథానాయికగా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. షారుక్ ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ చిత్రం లో ఐటెం సాంగ్ చేశారు. ప్రస్తుతం కన్నడ. మలయాళ సినిమాలలో కథానాయికగా నటిస్తున్నారు.

Born : June 4, 1982

సంబంధించిన చిత్రం