ప్రగ్య జైస్వాల్

Wednesday,November 23,2016 - 07:16 by Z_CLU

ప్రగ్య జైస్వాల్ ప్రముఖ కథానాయిక. జబల్పూర్, మధ్య ప్రదేశ్ లో జన్మించారు. ‘టిటూ’  చిత్రం తో హిందీ చిత్ర పరిశ్రమలో కథానాయికగా పరిచయం అయ్యారు. ఈ సినిమా తరువాత ‘మిర్చి లాంటి కుర్రాడు’ చిత్రం తో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. వరుణ్ తేజ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘కంచె’ చిత్రం తో కథానాయికగా తెలుగు లో గుర్తింపు అందుకున్నారు. ఈ చిత్రానికి గాను కథానాయికగా  ఫిలిం ఫేర్ అవార్డు  సైమా అవార్డు తో పాటు పలు అవార్డులు అందుకున్నారు. ప్రగ్య నాగార్జున కథానాయకుడిగా తెరకెక్కుతున్న భక్తి రస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’ ,’నక్షత్రం’,’గుంటూరోడు’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నారు.

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు