పూజ హెగ్డె

Sunday,October 25,2020 - 11:56 by Z_CLU

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు పూజా హెగ్డే. మిస్ యూనివర్స్ ఇండియా 2010 పోటీల్లో ఆమె సెకెండ్ రన్నరప్ గా నిలిచారు. మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మూగమూడి సినిమాతో 2012లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2014లో ఒక లైలా కోసం, ముకుంద సినిమాలు చేసింది. ఇక 2016లో మొహాంజదారో సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

అల్లు అర్జున్ తో కలిసి చేసిన దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో పూజా హెగ్డే తెలుగులో పాపులర్ అయింది. ఆ తర్వాత రంగస్థలంలో ఐటెంసాంగ్ చేసి ఇంకాస్త పాపులారిటీ సంపాదించుకుంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన సాక్ష్యం, ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమాలు చేసింది. మహేష్ సరసన మహర్షి సినిమాలు చేసింది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా నటించిన అల వైకుంఠపురములో సినిమాతో పూజా హెగ్డే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్ సినిమాలున్నాయి.

Born : 13 October 1990
Zodiac : Libra
Height : 5.8 Feet

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు