పవన్ కళ్యాణ్

Wednesday,December 16,2020 - 11:32 by Z_CLU

 కొణిదెల పవన్ కళ్యాణ్  నటుడు, రచయిత, దర్శకుడు , రాజకీయవేత్త . సెప్టెంబర్ 2, 1971 లో బాపట్ల (ఆంధ్ర ప్రదేశ్) లో జన్మించారు.

‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం తో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడి గా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. ‘సుస్వాగతం’,’గోకులం లో సీత’,’తమ్ముడు’,’ఖుషి’చిత్రాలతో కథానాయకుడిగా మంచి గుర్తింపు తో పాటు వరుస విజయాలు అందుకొని యూత్ ఐకాన్ గా పవర్ స్టార్ అనే బిరుదు అందుకున్నారు .
‘జల్సా’,’గబ్బర్ సింగ్’,’అత్తారింటికి దారేది’ వంటి చిత్రాలతో మంచి వసూళ్లు సాధించి కథానాయకుడిగా ఘన విజయాలు అందుకున్నారు.

ఇటీవలే బాబీ దర్శకత్వం లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో నటించిన పవన్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. దీంతో పాటు క్రిష్, హరీశ్ శంకర్, సాగర్ చంద్ర సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి.

Born : 2 September 1968

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు