నిఖిల్ సిద్ధార్థ్

Wednesday,June 22,2016 - 01:20 by Z_CLU

నిఖిల్ సిద్దార్థ్ జూన్ 1,1985  లో జన్మించారు. నిఖిల్ తెలుగు చిత్ర పరిశ్రమకు బాల నటుడిగా అన్నయ్య సినిమాతో పరిచయం అయ్యారు. ఆ తరువాత ‘జయం’,’సంబరం’ చిత్రాలలో బాల నటుడిగా నటించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన  ‘హ్యాపీ డేస్’ చిత్రం తో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం లో నాలుగురు కథానాయకులలో ఒకరి గా నటించిన నిఖిల్ రాజేష్ పాత్ర తో మంచి గుర్తింపు అందుకున్నారు. ఈ చిత్రం తరువాత ‘యువత’,’కళావర్ కింగ్’,’ఆలస్యం అమృతం విషం’,’వీడు తేడా’,’డిస్కో’ చిత్రాలలో కథానాయకుడిగా నటించారు. ‘స్వామి రా రా’,’కార్తీ కేయ’,’సూర్య వర్సెస్ సూర్య’ చిత్రాలతో కథానాయకుడిగా మంచి గుర్తింపు తో పాటు వరుస విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం నిఖిల్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం విడుదలకి సిద్దమవుతుంది.

Born : 1 june 1985
Zodiac : Gemini
Height : 5.9 Feet

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు