నవీన్ చంద్ర

Friday,July 15,2016 - 11:18 by Z_CLU

నవీన్ చంద్ర బళ్లారి, కర్ణాటక లో జన్మించారు. ‘సంభ వామి యుగే యుగే’ చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమ కు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. తెలుగు లో రెండో చిత్రం ‘కళ్యాణం’ తరువాత తమిళ చిత్ర పరిశ్రమ కు పరిచయం అయ్యారు. తమిళం లో రెండు సినిమాల్లో నటించి ‘అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తరువాత ‘దళం’,’నా రాకుమారుడు’, ‘భామ బోలేనాథ్’, ‘రచ్చ రంబోలా’, ‘త్రిపుర’, ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ సినిమాల్లో కథానాయకుడిగా నటించారు. ప్రస్తుతం ‘మీలో ఎవరు కొట్టేశ్వరుడు’ సినిమాతో పాటు నాని కథానాయకుడిగా నటిస్తున్న ‘నేను లోకల్’ లో నటిస్తున్నారు.

Born : Bellary, Karnataka