నాగశౌర్య

Thursday,October 29,2020 - 12:16 by Z_CLU

నాగశౌర్య ప్రముఖ కథానాయకుడు. జనవరి 14 , 1989 లో జన్మించారు. ‘క్రికెట్ గర్ల్స్ బీర్ సినిమాతో నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో ముగ్గురు కథానాయకులలో ఒకరిగా నటించారు. ఈ సినిమా తరువాత ‘చందమామ కథలు’ సినిమాలో ఒక పాత్రలో నటించిన నాగశౌర్య.. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం లో ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో పూర్తిస్థాయి హీరోగా గుర్తింపు అందుకున్నారు. తరువాత కథానాయకుడిగా ‘దిక్కులు చూడకు రామయ్య’ ,’లక్ష్మి రావే మా ఇంటికి’,’జాదూగాడు’,’అబ్బాయితో అమ్మాయి’,’కల్యాణ వైభోగమే’,’ఒక మనసు’,’జ్యో అచ్యుతానంద’ ,’నీ జత గా’ వంటి పలు సినిమాల్లో కథానాయకుడిగా నటించారు. ఛలో సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న శౌర్య.. ప్రస్తుతం వరుస సినిమాలతో లీడింగ్ హీరోగా కొనసాగుతున్నాడు.

సంబంధిత వార్తలు