నాగచైతన్య

Monday,November 30,2020 - 01:18 by Z_CLU

అక్కినేని నాగచైతన్య నవంబర్ 23, 1986 లో చెన్నై లో జన్మించారు. నాగచైతన్య లెజెండ్ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు మనవడు. అక్కినేని నాగార్జున తనయుడు. ప్రముఖ నిర్మాత మూవీ మొఘల్ రామానాయుడు మనవడు. అక్కినేని కుటుంబం నుండి ‘జోష్’ సినిమాతో మూడో తరం కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చారు.

మొదటి సినిమాతో నటుడిగా గుర్తింపు అందుకున్న నాగ చైతన్య, గౌతమ్ మీనన్ దర్శకత్వం లో రెండో చిత్రం ‘ఏ మాయ చేసావే’ తో సూపర్ హిట్ అందుకొని ఆ సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు.

సుకుమార్ దర్శకత్వం లో ‘100% లవ్’ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్న నాగచైతన్య ‘దడ’, ‘బెజవాడ’ వంటి వరుస సినిమాలతో అపజయాలు అందుకొని ‘తడాఖా’ సినిమాతో మరో హిట్ అందుకున్నారు. తాత అక్కినేని నాగేశ్వరరావు- తండ్రి నాగార్జున తో కలిసి ‘మనం’ అనే సినిమాలో నటించి గ్రాండ్ హిట్ అందుకున్నారు.

మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ ను తెలుగు లో రీమేక్ చేసి కెరీర్ లో మరో గ్రాండ్ హిట్ అందుకున్నారు. 2019లో చేసిన మజిలీతో మరోసారి బౌన్స్ బ్యాక్ అయిన ఈ హీరో.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Born : 23 November 1986

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు