ఎన్టీఆర్

Friday,November 13,2020 - 04:17 by Z_CLU

నందమూరి తారక రామరావు  (జూనియర్) మే 20, 1983 లో జన్మించారు. ప్రముఖ లెజెండ్ నటుడు, నిర్మాత, దర్శకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావు(లేట్) గారి మనవడు. ప్రముఖ నటుడు హరికృష్ణ కుమారుడు.

గుణ శేఖర్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘బాల రామాయణం’ చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమ కు బాల నటుడిగా పరిచయం అయ్యారు.  ‘నిన్ను చూడాలని’ చిత్రం తో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఎన్టీఆర్ కూచిపూడి నాట్యం లో శిక్షణ పొందారు. రాజమౌళి దర్శకత్వం లో  రెండో చిత్రం గా నటించిన ‘స్టూడెంట్ నంబర్ 1’ తో కథానాయకుడిగా గుర్తింపు తో పాటు బాక్సాఫీస్ వద్ద విజయం అందుకున్నారు.

ఈ చిత్ర తరువాత ‘సుబ్బు’ చిత్రం లో కథానాయకుడిగా నటించిన ఎన్టీఆర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ‘ఆది’ చిత్రంతో మరో ఘన విజయం అందుకున్నారు. ఈ చిత్రం  తారువాత ‘అల్లరి రాముడు’,’నాగ’ చిత్రాల్లో నటించిన తారక్ మరో సారి రాజమౌళి దర్శకత్వం లో నటించిన ‘సింహాద్రి’ తో కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకొని భారీ వసూళ్లు సాధించారు.

ఈ  చిత్రం తరువాత కథానాయకుడిగా వరుస సినిమాలు చేసిన ఎన్టీఆర్ ‘రాఖీ’, ‘యమదొంగ’, ‘అదుర్స్’, ‘బృందావనం’, ‘బాద్ షా’  సినిమాలతో కథానాయకుడిగా మంచి గుర్తింపు తో పాటు తన నటన, డాన్స్ తో యాంగ్ టైగర్ గా ఎదిగారు. ‘యమదొంగ’ చిత్రం కు గాను బెస్ట్ యాక్టర్ కెటగిరి లో ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. ఎన్టీఆర్ గాయకుడిగా కొన్ని చిత్రాలలో పాటలు పాడారు. ‘టెంపర్’,’నాన్నకు ప్రేమతో’ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న ఎన్టీఆర్.. ‘జనతా గ్యారేజ్’ జై లవకుశ, అరవింద సమేత చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాడు. ప్రస్తుతం RRR సినిమా చేస్తున్నాడు

Born : 20 May 1983
Zodiac : Taurus
Height : 5.8 Feet

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు