మోహన్ లాల్

Saturday,July 16,2016 - 10:53 by Z_CLU

మోహన్ లాల్ విశ్వనాధ్ నాయర్ (మోహన్ లాల్) మే 21, 1960 లో జన్మించారు. మోహన్ లాల్ మలయాళ నటుడు, నిర్మాత, గాయకుడు. ‘తిరనొత్తం’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా కొన్ని కారణాల వల్ల చాలా ఏళ్ళ ఆలస్యంగా విడుదలైంది. ‘మంజి విరింజ పూక్కల్’ అనే సినిమాతో నటుడిగా వెండి తెర పై ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాలో తన దైన నటన తో అందరినీ ఆకట్టుకొని వరుస ఆఫర్స్ తో వరుస విజయాలతో మలయాళ పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎదిగారు. 1991 లో ‘భారతం’ అనే సినిమాతో నిర్మాతగా మారారు. ఈ సినిమా మలయాళ ప్రేక్షకులను బాగా అలరించి ఘన విజయం సాధించింది. ఈ చిత్రం కు గాను నేషనల్ అవార్డు అందుకున్నారు మోహన్ లాల్. రెండు చిత్రంగా నిర్మించి నటించిన ‘వన ప్రస్తం’ సినిమాకు గాను మరో సారి  నేషనల్ ఫిలిం అవార్డు బెస్ట్ యాక్టర్ అందుకున్నారు. ఈ సినిమాను ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా మరియు ఇతర ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. మోహన్ లాల్ దాదాపు 300 పైగా మలయాళం, కన్నడ, హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కిన విలక్షణ సినిమాలలో నటించారు. మోహన్ లాల్ నటుడిగా ‘ఫిలిం ఫెర్’ అవార్డులతో పాటు మరెన్నో  ప్రతిశాత్మక అవార్డులను అందుకున్నారు. 2001 లో గవర్మెంట్ అఫ్ ఇండియా నుండి పద్మ శ్రీ బిరుదు అందుకున్నారు. తాజాగా ‘పులి మురుగన్’ సినిమాతో ఘన విజయం అందుకొని భారీ కలెక్షన్స్ వసూళ్లు చేస్తున్న మోహన్ లాల్ ప్రస్తుతం ‘ముంతిరివల్లికాల్ తళిరక్కుమ్బల్’ అనే సినిమాలో నటిస్తున్నారు.

Born : 21 May 1960

సంబంధిత వార్తలు