మేర్లపాక గాంధీ

Tuesday,July 11,2017 - 01:24 by Z_CLU

మేర్లపాక గాంధీ ప్రముఖ దర్శకుడు. ప్రముఖ రచయిత మేర్లపాక మురళి తనయుడిగా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత శర్వా నంద్ హీరోగా తెరకెక్కిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2016 సంక్రాంతి బరిలో రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టి సంక్రాంతి హిట్ గా నిలిచింది.