మంచు మనోజ్

Wednesday,March 01,2017 - 02:05 by Z_CLU

మంచు మనోజ్ ప్రముఖ కథానాయకుడు.. మే 20, 1983 న జన్మించారు.. ప్రముఖ కథానాయకుడు, నిర్మాత మోహన్ బాబు తనయుడిగా ‘మేజర్ చంద్ర కాంత్’ సినిమాతో బాల నటుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత ‘అడవిలో అన్న’,’ఖైదీ గారు’ వంటి సినిమాల్లో కూడా బాల నటుడిగా నటించాడు. ‘శ్రీ’ సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాతో కథానాయకుడిగా గుర్తింపు అందుకున్న తరవాత ‘దొంగ దొంగది’,’రాజు భాయ్’,’నేను మీకు తెలుసా’, ‘ప్రయాణం’, ‘బిందాస్’,’వేదం’,’జుమ్మంది నాదం’,’మిస్టర్ నూకయ్య’, ‘యూ కొడతారా ఉలిక్కి పడతారా’, ‘పోటుగాడు’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘కరెంట్ తీగ’, ‘శౌర్య’, ‘ఎటాక్’, ‘గుంటూరోడు’, ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాల్లో కథానాయకుడిగా నటించి పలు విజయాలు అందుకున్నారు..

సంబంధిత వార్తలు