కృష్ణ వంశీ

Thursday,July 27,2017 - 12:32 by Z_CLU

కృష్ణ వంశీ ప్రముఖ దర్శకుడు. పసుపులేటి వంశీ కృష్ణ పూర్తి పేరు. 27 జులై 1962 లో జన్మించారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర మొదట దర్శకత్వ శాఖలో పనిచేసిన కృష్ణ వంశీ 1995 లో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన గులాబీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘నిన్నే పెళ్లాడతా’, ‘సింధూరం’, ‘చంద్రలేఖ’, ‘అంతఃపురం’, ‘సముద్రం’,’మురారి’,’ఖడ్గం’,’శ్రీ ఆంజనేయం’, ‘చక్రం’, ‘డేంజర్’, ‘రాఖి’,’చందమామ’,’శశిరేఖా పరిణయం’, ‘మహాత్మా’,’పైసా’, ‘గోవిందుడు అందరి వాడేలే’,’నక్షత్రం’ సినిమాలకు దర్శకత్వం వహించారు. కృష్ణ వంశీ దర్శకుడిగా రెండు నేషనల్ ఫిలిం అవార్డ్స్, మూడు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, మూడు నంది అవార్డ్స్ అందుకున్నాడు.

సంబంధించిన చిత్రం