కళ్యాణ్ రామ్

Wednesday,November 02,2016 - 04:13 by Z_CLU

నందమూరి కళ్యాణ్ రామ్ జులై 5,1978 లో జన్మించారు. ప్రముఖ లెజెండ్ నటుడు, నిర్మాత, దర్శకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావు(లేట్) గారి మనవడు. ప్రముఖ నటుడు,రాజకీయ నాయకుడు  హరికృష్ణ కుమారుడు. ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్ సోదరుడు. బాల గోపాలుడు చిత్రం లో బాల నటుడిగా నటించారు. ‘తొలి చూపులోనే’ చిత్రం తో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత ‘నందమూరి తారక రామ రావు’ ఆర్ట్స్ బ్యానర్ ను స్థాపించి సొంత బ్యానర్ లో ‘అతనొక్కడే’ చిత్రాన్ని నిర్మించి నటించి సూపర్ హిట్ అందుకున్నారు. తరువాత ‘అసాధ్యుడు’,’విజయ దశమి’, ‘లక్ష్మి కళ్యాణం’, ‘హరే రామ్’ వంటి చిత్రాలతో కథానాయకుడిగా గుర్తింపు అందుకున్నారు. నిర్మాతగా కొన్ని ప్రయోగాత్మక చిత్రాలతో అపజయాలు అందుకున్న కళ్యాణ్ రామ్ ‘పటాస్’ చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకొని ఇతర భాషల్లో రీమేక్ అవుతుంది. ఈ చిత్ర తరువాత పూరి జగన్నాధ్ దర్శకత్వం లో ‘ఇజం’ సినిమాలు నటించి నిర్మించారు. ప్రస్తుతం నిర్మాత తమ్ముడు ఎన్టీఆర్ తో ఓ సినిమాను, కథానాయకుడిగా ఒక సినిమాను ప్రారంభించబోతున్నారు.

Born : 5th, JULY 1978

సంబంధిత వార్తలు