కాజల్ అగర్వాల్

Saturday,October 31,2020 - 08:07 by Z_CLU

కాజల్ అగర్వాల్ ప్రముఖ కథానాయిక. జూన్ 19, 1985 లో జన్మించారు. 2004 లో ‘క్యూ హో గయానా’ చిత్రం తో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. తెలుగులో కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా తేజ దర్శకత్వం లో తెరకెకెక్కిన ‘లక్ష్మి కళ్యాణం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ చిత్రం తరువాత నవదీప్, శివ బాలాజీ కథానాయకులుగా కృష్ణ వంశీ దర్శకత్వం లో తెరకెక్కిన ‘చందమామ’ లో చిత్రం లో కథానాయికగా నటించిన కాజల్ ఈ సినిమాతో తెలుగు కథానాయకిగా మంచి గుర్తింపు అందుకుంది. ఈ సినిమా తరువాత ‘పౌరుడు’ ,’ఆటాడిస్తా’ వంటి తెలుగు చిత్రాల్లో కథానాయికగా నటించింది. ‘పజని’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.తరువాత తమిళ్ లో పలు సినిమాల్లో కథానాయికగా నటించిన కాజల్ ‘సింగం’ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈచిత్రం తరువత హిందీ లో స్పెషల్ 26 అనే మరో సినిమాలో నటించారు. రామ్ చరణ్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ‘మగధీర’ సినిమాతో కథానాయికగా గొప్ప గుర్తింపు తో పాటు దక్షిణ భారత ఫిలిం ఫేర్ అవార్డు ను అందుకున్నారు. కాజల్ తెలుగు లో ‘గణేష్,’ఆర్య 2′ ,’ఓం శాంతి’,’డార్లింగ్’,’బృందావనం’,’మిస్టర్ పర్ఫెక్ట్’,’దడ’ బిజినెస్ మెన్’,’సారొచ్చారు’.’నాయక్’,’బాద్ షా’,’ఎవడు’,’గోవిందుడు అందరి వాడేలే’,’టెంపర్’,’సర్దార్ గబ్బర్ సింగ్’ పలు చిత్రాల్లో కథానాయికగా నటించి టాప్ కథానాయికగా  గుర్తింపు తో పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీకొచ్చి 12 ఏళ్లు అయినా ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది కాజల్.

Born : 19 june 1985
Zodiac : Gemini
Height : 5.5

సంబంధిత గ్యాలరీ

సంబంధిత వార్తలు