ఇలియానా

Monday,June 06,2016 - 11:14 by Z_CLU

ఇలియానా డిక్రుజ్ (ఆగష్టు 19, 1987) ముంబాయి,  తెలుగు సినిమా నటీమణి.

అరుణ భిక్షు దగ్గర కొంతకాలం నటనలో శిక్షణ పొందిన తర్వాత 2006లో ఇలియానా వై.వి.యస్.చౌదరి దర్శకత్వము వహించిన దేవదాసు చిత్రముతో తెలుగు చిత్రరంగ ప్రవేశము చేసింది. ఈ చిత్రములో ఆమె రామ్ సరసన నటించింది. ఇద్దరికీ తొలిచిత్రమైన ఈ సినిమా విడుదలయ్యాక సంచలనాత్మక విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో ఇద్దరి నటనకూ ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటీనటులు అవార్డులను సాధించారు. ఆ తర్వాత పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన పోకిరి సినిమాలో నటించింది. ఒక పోలీస్ అధికారిచే వేధించబడే శృతి అనే ఎయిరోబిక్స్ టీచర్ పాత్రను పోషించింది ఇలియానా. ఈ చిత్రం విడుదలయ్యాక నాటి తెలుగు సినిమా చరిత్రలో కనీ వినీ ఎరుగని విజయమై నిలిచింది. పోకిరి సినిమా విజయంతో ఇలియానా తెలుగు సినిమాలో ఒక ప్రముఖ నటిగా అవతరించింది.

ఆపై 2006లో తను కేడి అనే చిత్రంతో తమిళ్ సినిమాలోకి అడుగుపెట్టింది. రవికృష్ణ, తమన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం విజయవంతం కాకపొయినా ఇలియానాకు అవకాశాలు తగ్గలేదు. ఆ తర్వాత అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రవితేజ సరసన ఖతర్నాక్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం కూడా పరాజయం పాలైనప్పటికీ ఇందులో ఇలియానా తన అందచందాలకు మంచి ప్రశంసలు అందుకుంది. కానీ కృష్ణవంశీ దర్శకత్వంలో జూనియర్ ఎన్.టి.ఆర్. సరసన నటించిన రాఖీ మరియూ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రభాస్ సరసన నటించిన మున్నా చిత్రాలు తనని తిరిగి వజయపధంలోకి నడిపించాయి. ఈ విజయాలతో ఇలియానా తెలుగు సినిమాలో తిరుగులేని నటిగా అవతరించింది.

వ్యక్తిగత జీవితం :

ఇలియానా పుట్టి పెరిగింది ముంబాయిలో ప్రస్తుతం గోవాలో నివసిస్తున్నది. సినిమాలలోకి రాకముందు కొంతకాలముపాటు ఇలియానా వ్యాపార ప్రకటనలకు మోడలింగ్ చేసింది. ఈమెకు ముగ్గులు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఇలియానా అనే గ్రీకు పేరు ఈమెకు తన తండ్రి పెట్టిన పేరు. తల్లితండ్రులది లవ్ మ్యారేజ్. మదర్ ముస్లిం, ఫాదర్ కేథలిక్ క్రిస్టియన్. ఇంట్లో ఇద్దరు దేవుళ్లకు పూజలు జరిగేవి. అయితే ఏ విషయంలోనూ ఇద్దరూ గొడవ పడకపోవడం విశేష మంటుంది ఇలియానా.

 

Born : Aug 19, 1987
Zodiac : Scorpion
Height : 5.5

సంబంధిత వార్తలు